క్యారెక్టర్‌కి న్యాయం చేశామా, లేదా అన్నదే ముఖ్యం

  విక్టరీ వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా దర్శకుడు బాబీ తెరకెక్కించిన చిత్రం ‘వెంకీ మామ’. రాశి ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. శుక్రవారం వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా వెంకటేష్‌తో ఇంటర్వూ విశేషాలు… నాన్నగారి కోరిక తీరింది… నాన్నగారికి ఓ కోరిక ఉండేది. నేను, చైతు కానీ లేదా నేను, రానా కానీ.. […] The post క్యారెక్టర్‌కి న్యాయం చేశామా, లేదా అన్నదే ముఖ్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

విక్టరీ వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా దర్శకుడు బాబీ తెరకెక్కించిన చిత్రం ‘వెంకీ మామ’. రాశి ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. శుక్రవారం వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా వెంకటేష్‌తో ఇంటర్వూ విశేషాలు…

నాన్నగారి కోరిక తీరింది…
నాన్నగారికి ఓ కోరిక ఉండేది. నేను, చైతు కానీ లేదా నేను, రానా కానీ.. లేకపోతే అందరూ కలిసి ఓ సినిమా చేయాలని ఆయన కోరుకునేవారు. ఆయన ఉన్నప్పుడు కథలు కుదరలేదు. ఇప్పుడు కలిసి వచ్చింది. ‘వెంకీ మామ’ సినిమాతో ఆయన కోరిక తీరింది.

అది కూడా కలిసొచ్చింది…
ఈ మధ్య కాలంలో మామా అలుళ్ల బ్యాక్‌డ్రాప్‌లో ఏ సినిమా రాలేదు. అది కూడా ‘వెంకీమామ’కి కలిసొచ్చిందనే చెప్పాలి.

ఏవీ వాటి ముందు నిలబడవు…
ఒక బలమైన అనుబంధం ఉంటే, నిజమైన ప్రేమ ఉంటే… ఈ జాతకాలు, నమ్మకాలు ఏవీ వాటి ముందు నిలబడవు అనేది ఈ సినిమాలో చెప్పాం. నేను కూడా అదే నమ్ముతాను.

గొప్ప అనుభవం…
నేను, నాగచైతన్య కలిసి ఒక సినిమాలో నటించడమనేది గొప్ప అనుభవాన్నిచ్చింది. ఈ సినిమాలో ఒక కమర్షియల్ సినిమాకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. చేసేద్దామనుకుంటే మా కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడో వచ్చేసేది. కానీ ఇది సరైన కథ అనుకునే చేశాం. ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది.

అదే ముఖ్యం…
సినిమాలో ఎంత స్క్రీన్ టైమ్ ఉంది? మనం ఎంతసేపు కనిపిస్తాం? అన్నది అనవసరం. చేసిన క్యారెక్టర్‌కి న్యాయం చేశామా లేదా, మంచి సినిమా చేశామా లేదా అన్నదే ముఖ్యం. ‘ఎఫ్2’ కూడా అలా అనుకునే చేశా. ఇప్పుడీ వెంకీమామ కూడా అంతే.

చైతూ కెరీర్‌లో బెస్ట్…
చైతూకి బెస్ట్ సినిమా ఇవ్వాలనే ఉద్దేశం కూడా ముందునుంచి ఉంది. అందుకే ఈ సినిమా స్క్రిప్ట్ స్టేజ్‌లో ఉన్నప్పుడే చాలా శ్రద్ధ తీసుకోవడం జరిగింది. ‘వెంకీమామ’ చైతూ కెరీర్‌లో బెస్ట్ సినిమా అవుతుంది.

యంగ్‌స్టర్స్‌తో చేయాలి…
33 ఏళ్లుగా సినిమాలు చేస్తున్నాను. ఇంకా పెద్దగా సాధించేది ఏమీ లేదు. ఇటీవల వరుణ్‌తేజ్‌తో చేశాను. ఇప్పుడు చైతూతో చేశా. ఇంకా జూనియర్ ఎన్టీఆర్, నాని… ఇలా అందరూ యంగ్‌స్టర్స్‌తో సినిమాలు చేయాలి.

Venkatesh Exclusive Interview about Venky Mama

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post క్యారెక్టర్‌కి న్యాయం చేశామా, లేదా అన్నదే ముఖ్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: