మళ్లీ ఓడిన సింధు

గ్వాంగ్జు: డిఫెండింగ్ చాంపియన్ పివి సింధు బిడబ్లుఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్లో మరోసారి ఓటమి పాలయింది. గురువారం చైనాకు చెందిన చెన్ యుఫీ చేతిలో 22 20, 16 21, 12 21 స్కోరుతో పరాజయం పాలయింది. దీంతో సింధు ఈ సీజన్ చివరి టోర్నమెంట్‌లో పోటీనుంచి దాదాపుగా వైదొలగినట్లే అయింది. సింధుకు ఇది వరసగా రెండో ఓటమి. నలుగురు ఉన్న తన గ్రూపులో సింధు బుధవారం జపాన్‌కు చెందిన అకనే యమగుచి చేతిలోను ఓటమి పాలయిన […] The post మళ్లీ ఓడిన సింధు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

గ్వాంగ్జు: డిఫెండింగ్ చాంపియన్ పివి సింధు బిడబ్లుఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్లో మరోసారి ఓటమి పాలయింది. గురువారం చైనాకు చెందిన చెన్ యుఫీ చేతిలో 22 20, 16 21, 12 21 స్కోరుతో పరాజయం పాలయింది. దీంతో సింధు ఈ సీజన్ చివరి టోర్నమెంట్‌లో పోటీనుంచి దాదాపుగా వైదొలగినట్లే అయింది. సింధుకు ఇది వరసగా రెండో ఓటమి. నలుగురు ఉన్న తన గ్రూపులో సింధు బుధవారం జపాన్‌కు చెందిన అకనే యమగుచి చేతిలోను ఓటమి పాలయిన విషయం తెలిసిందే.

గురువారం జరిగే మరో మ్యాచ్‌లో యమగుచి బిన్ జియావో హేపై విజయం సాధిస్తే సింధు టోర్నమెంటునుంచి నిష్కరమించినట్లే అవుతుంది. అలా కాక బింగ్ జియావో గనుక విజయం సాధిస్తే రెండో స్థానం కోసం ముగ్గురు క్రీడాకారిణుల మధ్య పోటీ నెలకొంటుంది. తోలి పోటీలో మాదిరిగానే ఈ మ్యాచ్‌లో కూడా సింధు తొలి గేమ్‌ను గెలిచినప్పటికీ దాన్ని విజయంగా మలచుకోలేక ఓటమి పాలయింది.

PV Sindhu lost to Chen Yu Fei of China

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మళ్లీ ఓడిన సింధు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: