ఐపిఎల్ వేలానికి 332 మంది షార్‌లిస్టు

కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2020 ఆటగాళ్ల వేలానికి రంగం సిద్దమైంది. వచ్చే సీజన్ కోసం నిర్వహించే వేలంలో పాల్గొనడానికి మొత్తం 971 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా.. 332 మంది షార్ట్‌లిస్ట్ అయ్యారు. రిజిష్టర్ చేసుకున్న ఆటగాళ్ల నుంచి తాము కోరుకుంటున్న 332 మంది ఆటగాళ్ల పేర్లను ఎనిమిది ఫ్రాంచైజీలు ఫైనలైజ్ చేశాయి. ఈ జాబితాలో 43 మంది భారత్‌కు చెందినవారు కాగా మిగతావారు విదేశీ క్రికెటర్లు. ఈ 43 మందిలో 19 మంది […] The post ఐపిఎల్ వేలానికి 332 మంది షార్‌లిస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2020 ఆటగాళ్ల వేలానికి రంగం సిద్దమైంది. వచ్చే సీజన్ కోసం నిర్వహించే వేలంలో పాల్గొనడానికి మొత్తం 971 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా.. 332 మంది షార్ట్‌లిస్ట్ అయ్యారు. రిజిష్టర్ చేసుకున్న ఆటగాళ్ల నుంచి తాము కోరుకుంటున్న 332 మంది ఆటగాళ్ల పేర్లను ఎనిమిది ఫ్రాంచైజీలు ఫైనలైజ్ చేశాయి. ఈ జాబితాలో 43 మంది భారత్‌కు చెందినవారు కాగా మిగతావారు విదేశీ క్రికెటర్లు. ఈ 43 మందిలో 19 మంది టీమిండియా తరపున ప్రాతినిథ్యం వహించిన వారే ఉండటం విశేషం. ఇక ఎనిమిది ఫ్రాంచైజీలు ఈ జాబితా నుంచి గరిష్టంగా 73 మందిని మాత్రమే ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. దీంతో కోల్‌కతా వేదికగా డిసెంబర్ 19న జరగనున్న ఈ వేలంలో 332 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

గతేడాది జరిగిన ఐపీఎల్ వేలంలో ఎంతో మంది అనామక క్రికెటర్లను పలు ఫ్రాంచైజీలు భారీ మొత్తంలో చేజిక్కించుకున్నాయి. దీంతో ఈసారి ఏ క్రికెటర్‌పై ఫ్రాంచైజీలు కాసుల వర్షం కురిపిస్తారో అని ఆసక్తికరంగా మారింది. యూఏఈ వేదికగా జరిగిన టీ10లీగ్‌లో కేవలం 25 బంతుల్లోనే సెంచరీ సాధించిన సర్రే ఆటగాడు విల్ జాక్స్‌పైనే అందరి దృష్టి ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సారి వేలంలోకి వచ్చిన క్రికెటర్లలో ఆరోన్ ఫించ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, క్రిస్ లిన్, జాసన్ రాయ్, ఇయాన్ మోర్గాన్, ప్యాట్ కమిన్స్, మిచెల్ మార్స్, ఏంజెలో మాథ్యూస్, హెజిల్‌వుడ్, స్టెయిన్, ముస్తాఫిజుర్, రాబిన్ ఊతప్ప, పియూష్ చావ్లాలు ఎక్కువ ధర పలికే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా ముగిసిన టీ20 సిరీస్‌లో ఆకట్టుకున్న విలియమ్స్ షార్ట్ లిస్ట్ అయ్యాడు. దీంతో ఈ క్రికెటర్‌పై కూడా ఫ్రాంచైజీలు కన్నేశాయి.

332 shortlisted for IPL Auction

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఐపిఎల్ వేలానికి 332 మంది షార్‌లిస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: