టెస్టుల్లో కింగ్ టీమిండియా

మన తెలంగాణ/క్రీడా విభాగం: ఈ ఏడాది ప్రపంచ టెస్టు క్రికెట్‌లో టీమిండియా స్పష్టమైన ఆధిపత్యం చెలాయించిందనే చెప్పాలి. టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో, టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఇతర జట్లకు అందనంత ఎత్తులో ఉండడమే దీనికి నిదర్శనం. వన్డేలు, ట్వంటీ20లతో పోల్చితే సాంప్రదాయ టెస్టు క్రికెట్‌లో మాత్రం భారత్ ఎదురులేని శక్తిగా మారిందని చెప్పక తప్పదు. ఒక్క ఇంగ్లండ్ సిరీస్‌లో తప్ప భారత్ ఎక్కడ కూడా తడబడలేదు. సౌతాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌లతో జరిగిన టెస్టు సిరీస్‌లలో టీమిండియా ఏకచక్రాధిపత్యాన్ని చెలాయించింది. […] The post టెస్టుల్లో కింగ్ టీమిండియా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/క్రీడా విభాగం: ఈ ఏడాది ప్రపంచ టెస్టు క్రికెట్‌లో టీమిండియా స్పష్టమైన ఆధిపత్యం చెలాయించిందనే చెప్పాలి. టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో, టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఇతర జట్లకు అందనంత ఎత్తులో ఉండడమే దీనికి నిదర్శనం. వన్డేలు, ట్వంటీ20లతో పోల్చితే సాంప్రదాయ టెస్టు క్రికెట్‌లో మాత్రం భారత్ ఎదురులేని శక్తిగా మారిందని చెప్పక తప్పదు. ఒక్క ఇంగ్లండ్ సిరీస్‌లో తప్ప భారత్ ఎక్కడ కూడా తడబడలేదు. సౌతాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌లతో జరిగిన టెస్టు సిరీస్‌లలో టీమిండియా ఏకచక్రాధిపత్యాన్ని చెలాయించింది. ఈ సిరీస్‌లన్నీ భారత్ క్లీన్‌స్వీప్ చేయడమే దీనికి నిదర్శనంగా పేర్కొనవచ్చు. సొంత గడ్డపై జరిగే సిరీస్‌లతో పాటు విదేశాల్లో కూడా భారత జట్టు నిలకడై న ఆటతో ఆకట్టుకుంటోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ చాలా బలంగా తయారైంది.

స్పిన్‌కు అనుకూలించే ఉపఖండంలోనే కాకుండా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌లలో కూడా భారత్ నిలకడగా రాణిస్తోంది. ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో ఒక్క సెమీఫైనల్ మ్యాచ్‌లో తప్పితే మిగతా అన్ని పోటీ ల్లో కూడా భారత్ అలవోక విజయాలు సాధించడమే దీనికి చక్కటి ఉదాహరణగా చెప్పాలి. ఇక, టెస్టుల్లో మాత్రం భారత్ ప్రత్యర్థి జట్లకు అందనంత ఎత్తుకు చేరుకుంది. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఆడిన ఏడు మ్యాచుల్లో కూడా టీమిండియా భారీ విజయాలు సాధించింది. ఇందులో చివరి నాలుగు టెస్టుల్లో ఇన్నిం గ్స్ తేడాతో విజయం సాధించడం విశేషం.

ప్రపంచంలో ని బలమైన జట్లలో ఒకటిగా పేరున్న సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 30తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇందులో చివరి రెండు టెస్టుల్లో ఇన్నింగ్స్ తేడాతో భారత్ గెలిచింది. ఇక, బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను కూడా భారత్ వైట్‌వాష్ చేసింది. ఇక, కోల్‌కతాలో జరిగిన చారిత్రక డే నైట్ టెస్టు మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ తేడాతో జయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌ను భారత్ రెండున్నర రోజుల లోపే సొంతం చేసుకోవడం గమనార్హం.

ఓపెనింగ్‌లో ఎదురులేదు..

మరోవైపు టెస్టుల్లో భారత ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మలు ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ప్రతి సిరీస్‌లో ఇద్దరు ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నారు. కొత్త ఆటగాడు మయాంక్ ఆడింది కొన్ని మ్యాచులే అయినా టెస్టు క్రికెట్‌పై తనదైన ముద్ర వేశా డు. వరుస సెంచరీలతో మయాంక్ చెలరేగి పోతున్నా డు. బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా సిరీస్‌లలో మయాంక్ అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచాడు. ఇక, రోహిత్ శర్మ కూడా టెస్టుల్లో ఓపెనర్‌గా కుదురుకున్నాడు.

ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎదురులేని శక్తిగా పేరు తెచ్చుకున్న రోహిత్ టెస్టుల్లో కూడా అదే జోరును కొనసాగిస్తున్నాడు. వరుస శతకాలతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి, సీనియ ర్లు అజింక్య రహానె, చటేశ్వర్ పుజారాలు కూడా నిలకడైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నారు. ఇటు రహానె, అటు పుజారాలు మళ్లీ గాడిలో పడ్డారు. ఇద్దరు కూడా కీలక సమయాల్లో జట్టును ఆదుకుంటున్నారు. ఓపెనర్లు రోహిత్, మయాంక్‌లతో పాటు కోహ్లి, పుజా రా, రహానె, వికెట్ కీపర్ సాహా, ఆల్‌రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలతో భారత బ్యాటింగ్ చాలా బలంగా మారింది.

అగ్రస్థానంలోనే..

ఇక, టెస్టు ర్యాంకింగ్స్‌లో కొన్నేళ్లుగా భారత్ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ కంటే భారత 11 పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. టీమ్ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లి వరుసగా మూడో ఏడాది కూడా అగ్రస్థానాన్ని కాపాడుకుంది. గతంలో వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్ల మాదిరిగానే భారత్ కూడా ప్రపంచ క్రికెట్‌పై తనదైన రీతిలో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఫార్మాట్ ఏదైన వరుస విజయాలు సాధించడం టీమిండియా అలవాటుగా మార్చుకోంది. ఇక, వ్యక్తిగత ర్యాంకింగ్స్‌లో టీమిండియా సారథి విరాట్ కోహ్లి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవలే కోహ్లి మళ్లీ టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్‌ను వెనక్కి నెట్టి కోహ్లి తిరగి టాప్ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

బౌలింగ్ అదుర్స్

ఇక, బౌలింగ్‌లో కూడా భారత్‌కు ఎదురేలేదని చెప్పాలి. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలింగ్ లైనప్ కలిగిన జట్టుగా భారత్ కొనసాగుతోంది. ఫాస్ట్ బౌలింగ్‌తో పాటు స్పిన్‌లో భారత్ ఆధిపత్యం చెలాయిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బౌలర్లకు జట్టులో కొదవలేదు. స్పీడ్‌స్టర్లు జస్‌ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మలు ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నారు. ఇటీవల జరిగిన సిరీస్‌లలో బుమ్రా లేకున్నా షమి, ఉమేశ్, ఇషాంత్‌లు ఆ లోటు లేకుండా చూశారనే చెప్పాలి. ఇక, స్పిన్‌లో కూడా అశ్విన్, జడేజాలు అద్భుతంగా రాణిస్తున్నారు. అశ్విన్ తనలో చేవ తగ్గలేదని నిరూపిస్తున్నాడు. జడేజా బ్యాట్‌తో పాటు బంతితోనూ సత్తా చాటుతున్నాడు. ఇలా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న టీమిండియా టెస్టు క్రికెట్‌లో ఎదురులేని శక్తిగా ముందుకు దూసుకుపోతోంది.

Team india top the Test rankings

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post టెస్టుల్లో కింగ్ టీమిండియా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: