ఆ తీర్పే ఫైనల్

  18 అయోధ్య పిటిషన్లకు సుప్రీం తిరస్కరణ అసంబంధిలు అసమంజసాలు న్యూఢిల్లీ : అయోధ్య తీర్పు సమీక్షకు దాఖలైన 18 పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. సరైన ప్రాతిపదిక లేనందున వీటిని తోసిపుచ్చుతున్నట్లు ఐదుగురు సభ్యుల ధర్మాసనం తెలిపింది. నవంబర్ 9వ తేదీన రామజన్మభూమి బాబ్రీ మసీదు స్థల వివాదంపై అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. రామాలయ నిర్మాణానికి అనుకూలంగా ఆదేశాలు వెలువరించింది. తీర్పులోని అంశాలను సవాలు చేస్తూ దాఖలు అయిన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ […] The post ఆ తీర్పే ఫైనల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

18 అయోధ్య పిటిషన్లకు సుప్రీం తిరస్కరణ
అసంబంధిలు అసమంజసాలు

న్యూఢిల్లీ : అయోధ్య తీర్పు సమీక్షకు దాఖలైన 18 పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. సరైన ప్రాతిపదిక లేనందున వీటిని తోసిపుచ్చుతున్నట్లు ఐదుగురు సభ్యుల ధర్మాసనం తెలిపింది. నవంబర్ 9వ తేదీన రామజన్మభూమి బాబ్రీ మసీదు స్థల వివాదంపై అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. రామాలయ నిర్మాణానికి అనుకూలంగా ఆదేశాలు వెలువరించింది. తీర్పులోని అంశాలను సవాలు చేస్తూ దాఖలు అయిన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ బోబ్డే, డివై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్‌ఎ నజీర్, సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనం అంతర్గతంగా(ఇన్‌ఛాంబర్) పరిశీలించింది.

అయోధ్య స్థల వివాదంతో ఆది నుంచి సంబంధమున్న వారు దాఖలు చేసిన నాలుగు రివ్యూ పిటిషన్లను పరిశీలించేందుకు ధర్మాసనం అంగీకరించింది. తీర్పును సమీక్షించాలని మొత్తం 18 పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ధర్మాసనం తిరస్కరణకు గురయ్యాయి. ఇందులో తొమ్మిది పిటిషన్లు అంతకు పిటిషన్లతో పరోక్షంగా సంబంధమున్న వారు దాఖలు చేసినవి. మిగిలిన తొమ్మిది ఈ వ్యాజ్యాలతో నిమిత్తం లేని మూడో పక్షానికి చెందినవి. వీటన్నింటినీ తిరస్కరిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మొత్తం తొమ్మిది మూడో పక్షం పిటిషన్లలో 40 మంది వరకూ హక్కుల కార్యకర్తలు, సామాజిక ఉద్యమకర్తలతో కూడిన బృం దం దాఖలు చేసిన పిటిషన్ కూడా ఉంది. ఇప్పుడు రివ్యూ పిటిషన్ల తిరస్కరణతో ఇక సంబంధిత ఓపెన్ కోర్టు విచారణ అంశం కూడా పరిగణనలోకి రాకుండా పోయింది.

సుప్రీంకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఈ నెల రెండవ తేదీన తొలి పిటిషన్ దాఖలు అయింది. అయోధ్య స్థలానికి సంబంధించి నిజమైన చట్టబద్ధ వారసుడిని తానేనంటూ గతంలో వ్యాజ్యానికి దిగిన మౌలానా సమ్యద్ అస్షద్ రషీద్ ఈ పిటిషన్ వేశారు. ఆయన ఉత్తరప్రదేశ్ జమియత్ ఉలామా ఎ హింద్ అధ్యక్షులుగా ఉన్నారు. ఆ తరువాత విరామం ఇస్తూ పలు వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. అయితే కేవలం స్థల వివాద పిటిషన్లు వేసిన వారు దాఖలు చేసే పిటిషన్లనే పరిగణనలోకి తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయోధ్యలో మసీదు స్థలానికి బదులుగా ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వాలనే అంశాన్ని సవాలు చేస్తూ హిందూ మహాసభ దాఖలు చేసిన పిటిషన్ కూడా తిరస్కరణకు గురయింది.

SC dismisses all Ayodhya verdict review pleas

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆ తీర్పే ఫైనల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: