ముఖాకృతికి తగ్గట్టు!

  మెళ్లో నెక్లెస్ వేసుకోకపోయినా చెవులకు పెద్దగా కనిపించే షాండ్లియర్ రింగ్స్ ధరిస్తే చాలు. అయితే అందరికి అలా సెట్ అవవు కదా మరి. ఎలాంటి ముఖాకృతికి ఎలాంటి రింగులు సెట్ అవుతాయో అలాంటివి ఎంచుకుంటే సరి. ముందుగా వాటి గురించి తెలుసుకోవడం ముఖ్యం అంటున్నారు డిజైనర్లు. గుండ్రటి ముఖం కలిగిన వారికి… లాంగ్ డ్రాప్ కుందన్ ఇయర్ రింగ్స్‌ను సంప్రదాయ సందర్భాలకు వాడొచ్చు. డాంగ్లర్స్ కూడా ధరించొచ్చు. వీటివల్ల ముఖం స్లిమ్‌గా కనిపిస్తుంది. ఈ తరహా […] The post ముఖాకృతికి తగ్గట్టు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మెళ్లో నెక్లెస్ వేసుకోకపోయినా చెవులకు పెద్దగా కనిపించే షాండ్లియర్ రింగ్స్ ధరిస్తే చాలు. అయితే అందరికి అలా సెట్ అవవు కదా మరి. ఎలాంటి ముఖాకృతికి ఎలాంటి రింగులు సెట్ అవుతాయో అలాంటివి ఎంచుకుంటే సరి. ముందుగా వాటి గురించి తెలుసుకోవడం ముఖ్యం అంటున్నారు డిజైనర్లు.

గుండ్రటి ముఖం కలిగిన వారికి…
లాంగ్ డ్రాప్ కుందన్ ఇయర్ రింగ్స్‌ను సంప్రదాయ సందర్భాలకు వాడొచ్చు. డాంగ్లర్స్ కూడా ధరించొచ్చు. వీటివల్ల ముఖం స్లిమ్‌గా కనిపిస్తుంది. ఈ తరహా ముఖాకృతి కలిగిన వారు సర్క్యులర్ ఇయర్ రింగ్స్, హూప్స్, బటన్ స్టడ్స్ లాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. రెగ్యులర్ ఈవెంట్స్‌కు స్క్వేర్, యాంగ్యులర్ షేప్‌లో ఉన్న ఇయర్ రింగ్స్ ధరించొచ్చు. ఇంకా ట్రై చేద్దామనుకుంటే జామెట్రిక్ డ్రాప్ ఇయర్ రింగ్స్ ధరించవచ్చు.

చతురస్రాకారపు ముఖం కలిగిన వారు…
వీరి నుదురు, చెక్కిళ్లు ఒకేలా ఉంటాయి. ఈ తరహా ముఖాకృతి కలిగిన వారు తమ ముఖాకృతిలోని లోపాలను కప్పి పుచ్చే రీతిలో గుండ్రటి అంచులు కలిగిన చెవి రింగులు ధరిస్తే బాగుంటుంది. స్క్వేర్ షేప్ ఉన్నవి అస్సలు ధరించకూడదు. అండాకృతిలోని ఇయర్ రింగ్స్ లేదంటే హుప్స్ ధరించడం వల్ల అందంగా కనిపించొచ్చు.

హృదయాకృతి కలిగిన వారు…
చెవిరింగు పై భాగంలో సన్నగా ఉండి బాటమ్‌లో పెద్దగా ఉన్న ఇయర్ రింగ్స్ బాగుంటాయి. ఈ తరహా రింగ్స్ సన్నటి గడ్డాన్ని కాంప్లిమెంట్ చేసి ముఖాకృతిని మరింతగా వృద్ధి చేస్తాయి. షాండ్లియర్స్ లేదంటే లాంగ్ టియర్ డ్రాప్ ఇయర్ రింగ్స్ ధరించవచ్చు. అలాగని ఇన్వర్టడ్ ట్రయాంగిల్ ఆకృతిలోని ఇయర్ రింగ్స్ జోలికి వెళ్లకపోవడం మంచిది.

అండాకృతి కలిగిన వారు…
ఫ్యాషన్ పరంగా బెస్ట్ షేప్స్‌లో ఒకటిగా చెబుతుంటారు. ఎందుకంటే, దాదాపుగా ఏ తరహా ఇయర్ రింగ్ ధరించినా వీరికి బాగానే ఉంటుంది. కాకపోతే మరీ పొడవున్న ఇయర్ రింగ్స్ జోలికి వెళ్లక పోవడం ఉత్తమం.

ఇంకా ఏం చూడవచ్చంటే…
ముఖాకృతితో పాటుగా దవడలలోని ఎముకలు కూడా ఇయర్ రింగ్స్ ఎంపికలో ప్రాధాన్యం చూపుతాయి. ఎలా ఉండాలంటే… బోన్‌స్ట్రక్చర్ చిన్నగా ఉంటే, అలాంటివారు పలుచటి లేదంటే ఫ్లాట్, సున్నితమైన ఇయర్ రింగ్స్ ధరించవచ్చు. మీడియం బోన్ స్ట్రక్చర్ కలిగిన వారు మీడియం సైజ్ ఇయర్ రింగ్స్ ధరించాలి. బోన్‌స్ట్రక్చర్ పెద్దగా ఉంటే.. హెవీ లేదంటే చంకీ ఇయర్ రింగ్స్ ధరించవచ్చు.

Over body parts mentens with face

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ముఖాకృతికి తగ్గట్టు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: