విశ్రాంత ఉద్యోగిపై కాంట్రాక్టర్ దాడి

వనస్థలిపురం: ఇంటి ముందు కంకర వేసినందుకు ఇబ్బందికరంగా ఉందని భవన నిర్మాణ కంట్రాక్టర్‌ను ప్రశ్నించినందుకు  ప్రక్క ఇంటి యజమాని కూరం నర్సింహరెడ్డి (70)ని  కంట్రాక్టర్ తీవ్రంగా చితకబాదిన సంఘటన వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం బిఎన్‌రెడ్డినగర్ డివిజన్‌లోని గణేష్ ఎలక్ట్రికల్ దుకాణం సమీపంలో ఎం.సుధీర్ అనే వ్యక్తి నాలుగు అంతస్థుల భవనం నిర్మిస్తున్నాడు. ఈ భవనాన్ని రవికుమార్ అనే కంట్రాక్టర్ నిర్మాణం చేపట్టారు. బుధవారం సాయంత్రం కంట్రాక్టర్ భవన […] The post విశ్రాంత ఉద్యోగిపై కాంట్రాక్టర్ దాడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వనస్థలిపురం: ఇంటి ముందు కంకర వేసినందుకు ఇబ్బందికరంగా ఉందని భవన నిర్మాణ కంట్రాక్టర్‌ను ప్రశ్నించినందుకు  ప్రక్క ఇంటి యజమాని కూరం నర్సింహరెడ్డి (70)ని  కంట్రాక్టర్ తీవ్రంగా చితకబాదిన సంఘటన వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం బిఎన్‌రెడ్డినగర్ డివిజన్‌లోని గణేష్ ఎలక్ట్రికల్ దుకాణం సమీపంలో ఎం.సుధీర్ అనే వ్యక్తి నాలుగు అంతస్థుల భవనం నిర్మిస్తున్నాడు. ఈ భవనాన్ని రవికుమార్ అనే కంట్రాక్టర్ నిర్మాణం చేపట్టారు.

బుధవారం సాయంత్రం కంట్రాక్టర్ భవన నిర్మాణానికి కంకర ప్రక్కనే ఉన్న నర్సింహరెడ్డి గృహం ముందు మెట్టపై పోయించాడు. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది అవుతుందని నర్సింహరెడ్డి కంట్రాక్టర్ రవికుమార్‌ను నిలదీయడంతో  రెచ్చిపోయిన కంట్రాక్టర్ నర్సింహరెడ్డిపై దాడిచేసి గాయపర్చాడు. దీంతో నర్సింహరెడ్డి ముక్కు, పెదవి పగిలి రక్తస్రావం అయింది. తన జోలికి వస్తే భవనంపై నుంచి కింద పడేసి చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసేకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Contractor Attack on Retired Employee At Vanasthalipuram

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post విశ్రాంత ఉద్యోగిపై కాంట్రాక్టర్ దాడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: