దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీం సంచలన నిర్ణయం

  ఢిల్లీ: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్‌కౌంటర్‌పై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కమిషన్ చైర్మన్‌గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి విఎస్ సిర్‌పుర్కార్‌ను నియమించింది. కమిషన్ సభ్యులుగా బాంబే హైకోర్టు మాజీ జడ్జి రేఖ, సిబిఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్‌లు ఉన్నారు. తెలంగాణ హైకోర్టు, ఎన్‌హెచ్‌ఆర్‌సి విచారణను సుప్రీం నిలిపివేసింది. ఈ […] The post దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీం సంచలన నిర్ణయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఢిల్లీ: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్‌కౌంటర్‌పై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కమిషన్ చైర్మన్‌గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి విఎస్ సిర్‌పుర్కార్‌ను నియమించింది. కమిషన్ సభ్యులుగా బాంబే హైకోర్టు మాజీ జడ్జి రేఖ, సిబిఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్‌లు ఉన్నారు. తెలంగాణ హైకోర్టు, ఎన్‌హెచ్‌ఆర్‌సి విచారణను సుప్రీం నిలిపివేసింది. ఈ కేసులో మీడియా, సామాజికమాధ్యమాలపై కట్టడి విధించాలని సుప్రీం తెలిపింది. సభ్యుల భద్రత, విచారణకు కార్యాలయం ఏర్పాటు చేయాలని, కార్యాలయ సిబ్బందికి అవసరమైనవన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది. విచారణ కమిషన్ సభ్యుల భద్రత సిఆర్‌పిఎఫ్‌కు అప్పగించింది. తుది తీర్పు వచ్చేవరకు మీడియా నియంత్రణ పాటించాలని సుప్రీం సూచించింది. డిసెంబర్ ఆరో తేదీ తెల్లవారుజామున దిశపై అత్యాచారం చేసి హత్య చేసిన నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. 

We are of the considered view that an inquiry commission needs to be constituted. The inquiry to be completed in six months on Dish Encounter 

 

Commission Established on Disha Encounter by SC

The post దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీం సంచలన నిర్ణయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: