సెకండ్ సేల్‌కు సై

  ఇప్పుడంతా ఆన్‌లైన్ షాపింగ్ హవా నడుస్తోంది. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు ఎక్కడున్నా సరే ఒకే ఒక్క బటన్‌తో కావల్సినవన్నీ తెప్పించుకోవచ్చు. ఎఫ్‌బీ మార్కెట్ ప్లేస్, ఓఎల్‌ఎక్స్ లాంటి ఎన్నో వెబ్‌సైట్లు ఇలాంటి సేవలను అందిస్తున్నాయి. సెకండ్ సేల్ వస్తువులు, దుస్తులకు యువత ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నాయి. అందుకనే బోలెడన్ని వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ వెబ్‌సైట్లలో ఎవరైనా సరే బడ్జెట్‌కు తగ్గట్టుగా ఏవి కావాలంటే వాటిని కొనేసుకోవచ్చు. అమ్ముకోవచ్చు కూడా .. ఆన్‌లైన్ షాపింగ్ […] The post సెకండ్ సేల్‌కు సై appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఇప్పుడంతా ఆన్‌లైన్ షాపింగ్ హవా నడుస్తోంది. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు ఎక్కడున్నా సరే ఒకే ఒక్క బటన్‌తో కావల్సినవన్నీ తెప్పించుకోవచ్చు. ఎఫ్‌బీ మార్కెట్ ప్లేస్, ఓఎల్‌ఎక్స్ లాంటి ఎన్నో వెబ్‌సైట్లు ఇలాంటి సేవలను అందిస్తున్నాయి. సెకండ్ సేల్ వస్తువులు, దుస్తులకు యువత ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నాయి. అందుకనే బోలెడన్ని వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ వెబ్‌సైట్లలో ఎవరైనా సరే బడ్జెట్‌కు తగ్గట్టుగా ఏవి కావాలంటే వాటిని కొనేసుకోవచ్చు. అమ్ముకోవచ్చు కూడా ..

ఆన్‌లైన్ షాపింగ్ చాలా మందికి ఓ వ్యాపకంగా మారింది. కొంతమంది టైంపాస్ కోసం ఏదో ఒకటి ఆర్డరిచ్చేస్తుంటారు. ఆ వస్తువు అవసరం లేకున్నా. ఒక సర్వే ప్రకారం నగరంలో మొబైల్స్ తర్వాత ఎక్కువగా కొనేది వస్త్రాలనే అట. అమ్మాయిలు, అబ్బాయిలు కూడా ఈ విషయంలో పోటీ పడుతున్నారు. డబ్బుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి కొత్త ఫ్యాషన్స్ పట్ల ఆసక్తి ఉన్నా, కొనే స్థోమత లేని వారికి వరంగా కొన్ని వెబ్‌సైట్లు ఉన్నాయి. అవే ప్రీ లవ్డ్ వస్త్రాలను అందించే వెబ్‌సైట్లు.

అంటే సెకండ్ సేల్ వస్త్రాలన్నమాట. ఇక్కడ ధరలు కూడా సరసంగా, అందుబాటులోనే ఉంటున్నాయి. తమకు అవసరం లేని వస్త్రాలను, ఉపయోగం లేనివిగా పారేయకుండా వాటి ద్వారా కూడా సంపాదించే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌లో సెకండ్‌హ్యాండ్ వస్త్రాలను కొనుగోలు చేయడం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. ప్రీ లవ్డ్ వస్త్రాలతో పాటు ఎగుమతులను రిజెక్ట్ చేసిన వస్త్రాలను సైతం పలు వెబ్‌సైట్లలో విక్రయిస్తున్నారు. ఖాతా సృష్టించుకోవడం, అమ్మాలనుకున్న వస్త్రాల చిత్రాలను అప్‌లోడ్ చేసి, విక్రయించడమేనని వెబ్‌సైట్లు అంటుండటంతో చాలా మంది వీటి వైపు మొగ్గుచూపుతున్నారు.

సెకండ్ సేల్ వెబ్‌సైట్ల గురించి తెలుసుకుందాం..

1. స్టైల్‌ఫ్లిప్ : ప్రీ ఓన్డ్ ఫ్యాషన్ స్టోర్ లాంటిది. ఇక్కడ కేవలం కొనడమే కాదు, తాజా ట్రెండ్స్ కూడా తెలుసుకోవచ్చు. ఇండియాలో అతిపెద్ద కమ్యూనిటీ డ్రివెన్ వర్ట్యువల్ వార్డ్‌రోబ్ ప్లాట్‌ఫామ్ ఇది. కొనడం, అమ్మడం, వ్యక్తిగతశైలి గురించి తెలుసుకోవచ్చు.
2. ఓఎల్‌ఎక్స్ : ఇది ఎప్పటి నుంచో ఉన్న వెబ్‌సైట్. లోకల్ క్లాసిఫైడ్ లాంటిది.
3. కియాబ్జ : ఆన్‌లైన్ ప్రీ ఓన్డ్ బ్రాండ్ క్లాతింగ్‌స్టోర్ ఇది. 1500కు పైగా బ్రాండెడ్ వస్త్రాలు ఈ వెబ్‌సైట్‌లో లభిస్తాయి. ఈ సైట్ ద్వారా టీచ్ ఫర్ ఇండియా, విద్యలాంటి సంస్థలకు విరాళాలను అందించే అవకాశం ఉంది.
4. ఎలానిక్ : ఈ సైట్ ద్వారా అవతలి వ్యక్తితో మీరే నేరుగా చాట్ చేయొచ్చు. ధర మాట్లాడుకోవచ్చు. మీరు నిర్ణయించిన ధరపై కమీషన్ మాత్రం వెబ్‌సైట్‌కు చెల్లించాలి.
5. కౌట్‌లూట్ : దేశ వ్యాప్తంగా ఇప్పుడు క్రయవిక్రయాలను జరిపే అవకాశం కల్పిస్తుంది.
6. జాపిలి : హైస్ట్రీట్ ఫ్యాషన్ ఉమెన్‌క్లాత్స్ మాత్రమే ఇక్కడ దొరుకుతాయి. ప్రీ ఓన్డ్ క్లాత్స్‌పై భారీ డిస్కౌంట్లు లభిస్తాయి.
7. ఇటాషీ : ఫ్యాషన్ వస్తువులు మాత్రమే ఇక్కడ కొనడానికి, అమ్మడానికీ అవకాశం ఉంటుంది.
8. స్పాయిల్ : సెకండ్ హ్యాండ్ వస్తువులను స్థానికంగా విక్రయించేందుకు లేదంటే కొనేందుకు పనికొచ్చే వెబ్‌సైట్ ఇది. సౌందర్య ఉత్పత్తులు, బేబీ ప్రొడక్ట్, బహుమతులు, పుస్తకాలు, ఫర్నీచర్‌లాంటివి ఈ వెబ్‌సైట్‌లో అమ్మొచ్చు. కొనొచ్చు కూడా.
9. రిఫ్యాఫనర్ : వస్త్రాల నుండి ఫుట్‌వేర్ వరకూ, బ్యాగ్‌ల నుండి యాక్ససరీల వరకూ అమ్మేందుకు ఈ వెబ్‌సైట్ పనికొస్తుంది. డిజైనర్ వస్త్రాలు తక్కువ ధరలో దొరుకుతాయి.
10. పోష్‌మార్క్ : ఫ్యాషన్‌కు సంబంధించి సోషల్ కామర్స్ మార్కెట్ వెబ్‌సైట్. కొనడం, విక్రయించడమే కాకుండా వ్యక్తిగతశైలిని సైతం ప్రదర్శించే అవకాశం ఉంటుందిక్కడ.

విక్రయించేందుకూ మార్గదర్శకాలున్నాయి..
నిబంధనలు పాటించాలి: ఈ వెబ్‌సైట్లలో ఉన్న నిబంధనలను తప్పక పాటించాలి. నకిలీ లేదంటే నమూనాలను విక్రయించకూడదు. కొన్ని వెబ్‌సైట్లలో ఇండియన్ లేదంటే ఎథ్నిక్ ఔట్‌ఫిట్స్ విక్రయించడాన్ని అనుమతించవు. ఫ్యాషన్‌కదా అని ఇన్నర్ వేర్ లేదంటే నైట్‌వేర్ విక్రయాలకు పెట్టకూడదు. మరకలు ఉన్న వస్త్రాలు కూడా అమ్మకానికి పనికి రావు. చిరుగులు, దారాలు బయటకు వచ్చి ఉంటే ఆ వస్త్రాలను విక్రయించడానికి తీసుకోరు. రంగు వెలిసిన, జిప్‌లు, గుండీలు ఊడిపోయిన దుస్తులను అనుమతించరు. కొన్న రెండేళ్ల వరకూ అమ్మకానికి అనుమతిస్తారు.

Story about Second Sale Websites

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సెకండ్ సేల్‌కు సై appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: