ఏడు నిమిషాల్లోనే ఒక మిలియన్ వ్యూస్!

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. ఈ చిత్రం టీజర్‌ను బుధవారం విడుదల చేశారు. టీజర్ విడుదలైన ఏడు నిమిషాల్లోనే ఒక మిలియన్ వ్యూస్ రావడం విశేషం. తెలుగులో ఇది మొదటిసారని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ ఈ టీజర్‌లో “నువ్వు ఇప్పుడే కారు దిగావు… నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కా” అని చెప్పే డైలాగ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ […] The post ఏడు నిమిషాల్లోనే ఒక మిలియన్ వ్యూస్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. ఈ చిత్రం టీజర్‌ను బుధవారం విడుదల చేశారు. టీజర్ విడుదలైన ఏడు నిమిషాల్లోనే ఒక మిలియన్ వ్యూస్ రావడం విశేషం. తెలుగులో ఇది మొదటిసారని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ ఈ టీజర్‌లో “నువ్వు ఇప్పుడే కారు దిగావు… నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కా” అని చెప్పే డైలాగ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

పలు విజయవంతమైన చిత్రాలను అందించిన గీతా ఆర్ట్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకానుంది. అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్కర్, తనికెళ్ల భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, కల్యాణి నటరాజన్, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష తదితరులు ఈ చిత్రంలో ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కెమెరామెన్: పి.ఎస్.వినోద్, సంగీతం: తమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, ఫైట్స్: రామ్, లక్ష్మణ్.

Ala Vaikunthapurramloo clock 1 million views in 7 minutes

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఏడు నిమిషాల్లోనే ఒక మిలియన్ వ్యూస్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: