మా బకాయిలివ్వండి

తెలంగాణకు రావలసిన నిధులు, జిఎస్‌టి బకాయిలు వెంటనే చెల్లించండి : పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ప్లకార్డులతో టిఆర్‌ఎస్ ఎంపిల ధర్నా మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి రావాల్సిన నిధులు, జిఎస్‌టి బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చే స్తూ టిఆర్‌ఎస్ ఎంపిలు ప్లకార్డులతో ధర్నా చేశారు. బుధవారం పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ఎంపిలు ఆందోళన చేశారు. ఉభయసభల్లో టిఆర్‌ఎస్ ఎంపిలు వా యిదా తీర్మానం ఇచ్చారు. వెనుకబడిన జిల్లాల కు రావాల్సిన […] The post మా బకాయిలివ్వండి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
తెలంగాణకు రావలసిన నిధులు, జిఎస్‌టి బకాయిలు వెంటనే చెల్లించండి : పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ప్లకార్డులతో టిఆర్‌ఎస్ ఎంపిల ధర్నా

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి రావాల్సిన నిధులు, జిఎస్‌టి బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చే స్తూ టిఆర్‌ఎస్ ఎంపిలు ప్లకార్డులతో ధర్నా చేశారు. బుధవారం పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ఎంపిలు ఆందోళన చేశారు. ఉభయసభల్లో టిఆర్‌ఎస్ ఎంపిలు వా యిదా తీర్మానం ఇచ్చారు. వెనుకబడిన జిల్లాల కు రావాల్సిన నిధులు, ఆర్థికసంఘం బకాయి లు, గ్రామీణాభివృద్ధి నిధులను తక్షణమే విడుదల చేయాలని ఎంపిలు డిమాండ్ చేశారు.

ఆర్థికమాంద్యం సాకును చూపి రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇవ్వడం లేదని ఈ సందర్భంగా ఎంపిలు ఆరోపించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నులో రాష్ట్ర వాటా ఇప్పటివరకు గతేడాది కంటే 2.13 శాతం తక్కువ ఇచ్చిందని, వాస్తవంగా గతేడాది కంటే అదనంగా 6.2 శా తం రావాల్సి ఉండగా మైనస్‌లోకి వెళ్లిందని వా రు పేర్కొన్నారు. దీంతో రావాల్సిన 8.3 శాతం కంటే తక్కువ వాటా నిధులు తెలంగాణకు వచ్చాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సిఎం కెసిఆర్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు గత నెల 7వ తేదీన లేఖ రాసిన విషయం తెలిసిందే.

TRS lawmakers protest in Parliament premises

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మా బకాయిలివ్వండి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: