పౌరసత్వ బిల్లుకు రాజ్యసభా విజయం

అత్యంత వివాదాస్పదమై ఈశాన రాష్ట్రాలను భగ్గున మండిస్తున్న పౌరసత్వ చట్టం సవరణ బిల్లుకు రాజ్యసభ మెజారిటీ ఓటుతో ఆమోదం తెలిపింది. దీనితో బిల్లుకు పార్లమెంట్ ఆమోదముద్రను ప్రధాని మోడీ ప్రభుత్వం సాధించింది. రాజ్యసభ ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 125, ప్రతికూలంగా 105 ఓట్లు పడ్డాయి. దేశంలో కుల, మత, ప్రాంత వర్గాలకు లింగ పరమైన తేడాలకు అతీతంగా అందరికీ సమాన పౌరసత్వం కల్పిస్తున్న భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం అంటూ బిల్లును కాంగ్రెస్, టిఆర్‌ఎస్ సహా పలు […] The post పౌరసత్వ బిల్లుకు రాజ్యసభా విజయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అత్యంత వివాదాస్పదమై ఈశాన రాష్ట్రాలను భగ్గున మండిస్తున్న పౌరసత్వ చట్టం సవరణ బిల్లుకు రాజ్యసభ మెజారిటీ ఓటుతో ఆమోదం తెలిపింది. దీనితో బిల్లుకు పార్లమెంట్ ఆమోదముద్రను ప్రధాని మోడీ ప్రభుత్వం సాధించింది. రాజ్యసభ ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 125, ప్రతికూలంగా 105 ఓట్లు పడ్డాయి. దేశంలో కుల, మత, ప్రాంత వర్గాలకు లింగ పరమైన తేడాలకు అతీతంగా అందరికీ సమాన పౌరసత్వం కల్పిస్తున్న భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం అంటూ బిల్లును కాంగ్రెస్, టిఆర్‌ఎస్ సహా పలు ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఓటింగ్ సమయంలో శివసేన రాజ్యసభ నుంచి వాకౌట్ చేసింది. బిల్లు రాజ్యాంగం 14వ అధికరణకు వ్యతిరేకం కాదని పొరుగు దేశాల మాదిరిగా భారతదేశంలో మైనారిటీలను అణచివేసే సంప్రదాయం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తన ప్రసంగంలో పేర్కొన్నారు.

భారతదేశానికి విశిష్ఠమైన రోజు. మన సంప్రదాయంలో మిళితమైన కరుణ, సౌభ్రాతృత్వాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. ఎన్నో ఏళ్లుగా పీడనకు గురవుతున్న వారికి ఈ బిల్లు ఉపశమనం
వీగిపోయిన విపక్షాల సవరణ ప్రతిపాదనలు,  శివసేన యూటర్న్.. పెద్దలసభ నుంచి వాకౌట్, బిల్లు రాజ్యాంగ విరుద్ధం : విపక్షాలు,  కోర్టులో నిలవదు : కాంగ్రెస్

న్యూఢిలీ: పౌరసత్వ సవరణ బిల్లు 2019ను రాజ్యసభ బుధవారం ఆమోదించింది. ఆరున్నర గంటల పాటు వా డివేడిగా సాగిన చర్చ, కీలక సవరణల ప్రతిపాదనలు వీగిపోయిన తరువాత జరిగిన ఓటింగ్‌లో బిల్లు 125 మంది సభ్యుల మద్దతుతో ఆమోదం పొంది ంది. బిల్లుకు వ్యతిరేకంగా 105 మంది సభ్యులు ఓటేశారు. కేవలం 20 మంది సభ్యుల ఆధిక్యతతో రాజ్యసభలో ఈ బిల్లు నెగ్గడంతో పార్లమెంట్ ఈ కీలక బిల్లుకు ఆమోద ముద్ర వేసినట్లయింది. కొన్ని పక్షాల వాకౌట్ల నడుమ ఓటి ంగ్ సమయంలో సభలో 230 మంది సభ్యులు ఉన్నారు.

ఇప్పటికే లోక్‌సభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. బిల్లు కు మెజార్టీ సభ్యుల ఆమోద ముద్ర ఉం దని రాజ్యసభ అధ్యక్షులు వెంకయ్యనాయుడు సభలో ప్రకటించారు. ఈ బి ల్లు సమగ్రరీతిలో ఉందని, ఎవరి పౌరసత్వాన్ని హరించే ప్రసక్తే లేదని, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్‌ల్లో వేధింపుల కు గురైన మైనార్టీలకు ఇక్కడి పౌరస త్వం కల్పించేందుకు ఈ చట్టం తీసుకువచ్చినట్లు రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి చెప్పారు. ప్రతిపక్ష సభ్యుల తీ వ్ర నిరసనలు, అధికార పక్ష సభ్యుల హర్షధ్వానాల నడుమ బిల్లు ఆమోదం పొందింది. ఇక ఇది చట్టరూపం  దక్కించుకోనుంది. ప్రభుత్వం పేర్కొన్న దేశాలకు చెందిన ముస్లింలకు పౌరసత్వ పరిధి ఉండదు. వీరిని చట్ట ప్రకారం అక్రమ వలసదార్లుగానే భావిస్తారు.

బిల్లు ముస్లింలకు వ్యతిరేకంగా ఉందనే ప్రతిపక్షాల వాదనను కేంద్రం తోసిపుచ్చింది. ముస్లింలకు వ్యతిరేకంగా బిల్లు లేద ని, వారు ఎటువంటి భయాందోళనల కు గురి కావద్దని, మతప్రాతిపదికన దేశాన్ని విభజించి తరువాత దెబ్బతీసింది కాంగ్రెస్ అని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. తాము పేర్కొన్న మూడు దేశాలలో దెబ్బతిన్న మైనార్టీలకు ఇక్కడి అధికారిక నివాసత్వం కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కోణంలో ఇతర ఉద్ధేశాలను ఆపాదించడం కుదరదన్నారు. బిల్లుకు అనుకూలంగా బిజెపితో పాటు మిత్రపక్షాలు జెడియు, ఎస్‌ఎడిలు ఓటేశాయి. ఇక అన్నాడిఎంకె, టిడిపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, బిజెడిలు మద్దతు ఇచ్చాయి. దీనితో అత్యల్ప ఓట్లతోనే ఈ బిల్లుకు ఎగువసభ ఆమోదం దక్కింది. పూర్వపు మిత్రపక్షం ఇప్పుడు ప్రత్యర్థి వర్గం అయిన శివసేన ఓటింగ్‌కు దూరంగా ఉంది. సభ నుంచి వాకౌట్ జరిపింది. లోక్‌సభలో బిల్లుకు మద్దతు తెలిపిన శివసేన రాజ్యసభలో దీనిపై యూటర్న్ తీసుకుంది. 10 మంది సభ్యులు సభకు గైర్హాజరయ్యారు.

సెలెక్ట్ కమిటీకి కూడా నిరాకరణ

ప్రతిపక్షాలు ఈ బిల్లుకు తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలు సవరణలు ప్రతిపాదించాయి. బిల్లును సెలెక్టు కమిటీ పరిశీలనకు పంపించాలని పట్టుపట్టాయి. అయితే దీనిపై జరిగిన ఓటింగ్‌లో పరిశీలనకు పంపించరాదని 124 మంది, పంపించాలని 99 మంది ఓటేశారు. దీనితో ప్రతిపక్షాల పట్టు చెల్లకుండా పోయింది. బిల్లుకు ప్రతిపక్షాలు చేసిన పలు సవరణలను సభ మూజువాణితో తిరస్కరించింది. సోమవారం ఈ బిల్లుకు లోక్‌సభ సుదీర్ఘ స్థాయి చర్చల తరువాత అర్థరాత్రి ఆమోదించింది. ఇక ప్రతిపక్షం బలం బాగానే ఉన్న రాజ్యసభలో బిల్లు ఆమోదం ప్రభుత్వానికి కీలకంగా మారింది. అయితే ఇక్కడ కూడా కొన్ని పక్షాల వాకౌట్లు, ఎన్‌డిఎకు చెందని పక్షాల మద్దతుతో బిల్లు ఆమోదం దక్కించుకుంది.

శ్రీలంకలో వేధింపులకు గురవుతోన్న మైనార్టీల గురించి బిల్లులో ఎందుకు ప్రస్తావించలేదని, వారికి పౌరసత్వం కల్పించడాన్ని ఎందుకు మినహాయించారనే అంశంపై అమిత్ షా స్పందించారు. శ్రీలంకలోని తమిళులకు ఇప్పటికే భారతీయ పౌరసత్వం కల్పించడం జరిగిందని, ఇప్పుడు తీసుకువస్తున్న చట్టం ఒక నిర్థిష్ట సమస్య పరిష్కారానికి అని వివరణ ఇచ్చారు. ముస్లింలను ఎందుకు మినహాయిస్తున్నారనే ప్రతిపక్షాల ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ ఇతర దేశాలకు చెందిన ముస్లింలు ఇక్కడి పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటి నిబంధనలు వీలుకల్పిస్తున్నాయని అన్నారు.

565 మంది ముస్లింలకు భారతీయ పౌరసత్వం ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటి సవరణ బిల్లు, అంతకు ముందు తీసుకువచ్చిన ఆర్టికల్ 370 రద్దు బిల్లు ఈ విధంగా అనేక సందర్భాలలో కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాల వాదన కేవలం పాకిస్థాన్ నేతల ప్రకటనల మాదిరిగానే ఉందన్నారు. వారు విదేశీ బాకా కొడుతున్నారని అన్నారు. త్రిపుల్ తలాక్ బిల్లు కానీ ఈ బిల్లు కానీ ప్రభుత్వం తీసుకువచ్చే ఏ బిల్లు కానీ ముస్లిం వ్యతిరేకం కానేకాదని, ఈ బిల్లుతో ఏ ఒక్కరి పౌరసత్వ హరణం జరగడం లేదన్నారు.

భారతీయ ముస్లింలు ఇక్కడి పౌరులే

భారతదేశంలో నివసించే ముస్లింలు ఎప్పుడూ ఇక్కడి పౌరులే అని, ఇక ముందు కూడా ఇదే విధంగా ఉంటారని, ఈ ముస్లిం వర్గాలు ఎటువంటి ఆందోళనకు గురికావద్దని అమిత్ షా హామీ ఇచ్చారు. దేశ విభజన మతప్రాతిపదికన జరిగింది. తరువాత కూడా పలు అన్యాయాలు జరిగాయి. ఇవి ఎవరి హయాంలో జరిగాయనేది అందరికీ తెలిసిందే. ఈ తప్పిదాలను సరిదిద్దేందుకే ఇప్పుడు ఈ బిల్లు తీసుకువచ్చినట్లు అమిత్ షా తెలిపారు. కాంగ్రెస్ పలు అక్రమాలకు పాల్పడిందని, ఇప్పుడు విమర్శలకు దిగడం ద్వారా వారు చేసిన తప్పిదాలు ఒప్పులు అవుతాయా? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ హయాంలో పాకిస్థాన్‌కు చెందిన 13వేల మంది హిందువులు, సిక్కులకు భారత పౌరసత్వం కల్పించారు. అప్పట్లో ఇతర వర్గాలగురించి ఎటువంటి ప్రస్తావన తేలేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడే తీరు వారి ద్వంద్వ మాటలకు నిదర్శనమని షా విమర్శించారు. ఈ బిల్లుతో రాజ్యాంగంలోని 14వ ఆర్టికల్‌కు వచ్చే నష్టం ఏదీ లేదని, సముచిత వర్గీకరణల ప్రాతిపదికన ఉండే చట్టాలను దెబ్బతీసే ప్రసక్తే లేదన్నారు. ప్రతిపాదిత చట్టం కేవలం ఆయా దేశాలలో వేధింపులకు గురవుతున్న ఆయా వర్గాలకు సంబందించి తీసుకువచ్చిందేనని, అందుకే ఇందులో ముస్లింలను చేర్చలేదని మంత్రి తెలిపారు. అన్ని విధాలుగా చట్టసవరణల ప్రక్రియ తరువాతనే బిల్లును తీసుకువచ్చినట్లు తెలిపారు.

మాటిచ్చాం . బిల్లు తెచ్చాం

ప్రజలకు లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈ పౌరసత్వ సవరణ చట్టం గురించి కీలకమైన హామీ ఇచ్చామని, ఈ మేరకు ఎన్నికల ప్రణాళికను రూపొందించామని, ఈ మేనిఫెస్టోకు అనుగుణంగానే ఇప్పుడు పౌర బిల్లును తీసుకువచ్చామని కేంద్రం తరఫున హోం మంత్రి అమిత్ షా బిల్లును ప్రవేశపెట్టిన దశలో తరువాత చర్చల ప్రక్రియ నడుమ పదేపదే ప్రకటించారు. తమ ఎన్నికల ప్రణాళికను ప్రజలు ఆమోదించారని, ఈ మేరకు ప్రజాతీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని, ఈ ప్రజాతీర్పు ప్రాతిపదికనే చట్టం రూపకల్పన దిశలో తాము పార్లమెంట్‌లో చర్యకు దిగామని ప్రభుత్వం తెలియచేసుకుంది. అయితే మత ప్రాతిపదికన బిల్లు తీసుకురావడం దారుణమని, రాజ్యాంగంలోని మౌలిక అంశాలను ప్రత్యేకించి లౌకిక సంవిధానాన్ని దెబ్బతీసే విధంగా ఈ బిల్లు ఉందని ప్రతిపక్షాలు ప్రత్యేకించి కాంగ్రెస్ ఈ బిల్లుపై తీవ్రస్థాయి నిరసనలు వ్యక్తం చేశాయి.

పలు సవరణలకు ప్రతిపాదించాయి. బిల్లును సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపించాల్సిందని రాజ్యసభలో పట్టుపట్టాయి. దాదాపు 24 సవరణలను ప్రతిపాదించాయి. అయితే అంశాల వారిగా జరిగిన సవరణలు, సెలెక్ట్ కమిటీకి పంపించాలనే విషయంపై జరిగిన ఓటింగ్‌లో అధికారపక్షం పైచేయి సాధించింది. ప్రతిపక్షాల వాదన కేవలం నిరసనలు, సవరణల ప్రతిపాదనలకే పరిమితం అయింది. సెలెక్ట్ కమిటీకి బిల్లును పంపించాలనే ప్రతిపక్షాల వాదన వీగిపోయింది.

ఈ దశలో ఆ తరువాత రాజ్యసభలో ఈ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు మద్దతు దక్కింది. ఈ విధంగా రెండు సభలలో బిల్లు ఆమోదం పొందడంతో నిర్థిష్ట విదేశీయులకు పౌరసత్వం కల్పించే అంశం ఇక చట్టరూపం పొందుతుంది. ఈ మేరకు మతపరమైన వేధింపులకు గురై పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్థాన్‌ల నుంచి వచ్చిన ముస్లిమేతర వర్గాలకు భారతీయ పౌరసత్వం కల్పిస్తారు. ఇక్కడికి ఈ విధమైన కారణంతో వచ్చిన హిందువులు, క్రిస్టియన్లు, పార్శీలు, బౌద్ధులు, సిక్కులకు ఇక్కడి పౌరసత్వం లభిస్తుంది.

Rajya Sabha passes Citizenship Amendment Bill

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పౌరసత్వ బిల్లుకు రాజ్యసభా విజయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: