వాంఖడేలో పరుగుల వరద

ముంబయి: వెస్టిండీస్‌తో జరిగిన నిర్ణాయక మ్యాచ్‌లో భారత బ్యాట్‌మెన్ శివమెత్తారు. సిక్స్‌లు, ఫోర్లతో విండీస్ బౌలర్లను చీల్చి చెండాడారు. ఓపెనర్లు రోహిత్ శర్మ(34 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 71), కెఎల్ రాహుల్ (56 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 91) మొదటి వికెట్‌కు 135 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసి శుభారంభాన్ని అందించారు. రోహిత్ శర్మ ఔటయిన తర్వాత వచ్చిన రిషబ్ పంత్ పరుగులేమీ చేయకుండా వెనుదిరిగి నిరాశపర్చినప్పటికీ తర్వాత వచ్చిన […] The post వాంఖడేలో పరుగుల వరద appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి: వెస్టిండీస్‌తో జరిగిన నిర్ణాయక మ్యాచ్‌లో భారత బ్యాట్‌మెన్ శివమెత్తారు. సిక్స్‌లు, ఫోర్లతో విండీస్ బౌలర్లను చీల్చి చెండాడారు. ఓపెనర్లు రోహిత్ శర్మ(34 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 71), కెఎల్ రాహుల్ (56 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 91) మొదటి వికెట్‌కు 135 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసి శుభారంభాన్ని అందించారు. రోహిత్ శర్మ ఔటయిన తర్వాత వచ్చిన రిషబ్ పంత్ పరుగులేమీ చేయకుండా వెనుదిరిగి నిరాశపర్చినప్పటికీ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ హిట్టింగ్‌కు సరికొత్త నిర్వచనం చెబుతూ విశ్వరూపం ప్రదర్శించాడు.

కేవలం 29 బంతుల్లో 7 సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 240 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.241 పరుగుల లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన విండీస్ ఏ దశలోను దీటయిన పోటీ ఇవ్వలేక చేతులెత్తేసింది. ఇన్నింగ్స్ ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్ 67 పరుగుల తేడాతో విజయం సాధించి మ్యాచ్‌తో పాటుగా సిరీస్‌ను కూడా సొంతం చేసుకుంది.

ఓపెనర్ల వీర విహారం

టాస్ గెలిచి విండీస్ బౌలింగ్‌ను ఎంచుకోవడంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్‌లు ఆదినుంచే విండీస్ బౌలర్లపై విరుచుకు పడ్డారు. దీంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరి జోరుకు పవర్‌ప్లే ముగిసే సమయానికే టీమిండియా 72 పరుగులు సాధించింది. ఈ క్రమం లో రోహిత్ కేవలం 23 బంతుల్లోనే4 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే రాహుల్ కూడా 25 బంతు ల్లో 6 ఫోరు, ్ల2 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ చేశా డు. అయితే అర్ధ సెంచరీ చేసిన తర్వాత దూకుడు మరింత పెంచిన రోహిత్ అదే క్రమంలో విలియమ్స్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి హేడెన్ వాల్ష్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో వీరిద్దరి మధ్య తొలి వికెట్‌కు 135 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

రాహుల్ ఔటయిన తర్వాత వచ్చిన రిషబ్ పంత్ మరోసారి నిరాశపరిచాడు. వచ్చీ రాగానే పోలార్డ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి హోల్డర్‌కు క్యాచ్ ఇచ్చి పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. అనంతరం బరిలోకి వచ్చిన సారథి విరాట్ కోహ్లీ తన విశ్వరూపాన్ని చూపించాడు. విండీస్ బౌలర్లపై విరుచుకుపడిన కోహ్లీ కేవలం 29 బంతుల్లో 7 సిక్స్‌లు, నాలుగు బౌండరీలతో 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో 91 పరుగులు చేసిన రాహుల్ చివరి ఓవర్‌లో ఔటయ్యాడు. చివరి బంతికి కోహ్లీ సిక్స్ బాదడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోరు చేసింది. విండీస్ బౌలర్లలో కాట్రెల్, విలియమ్స్, పోలార్డ్‌లకు తలా ఒక వికెట్ దక్కింది. భారత ఇన్నింగ్స్‌లో 16 సిక్స్‌లు, 19 ఫోర్లు ఉన్నాయంటే బ్యాట్స్‌మెన్ ఎంత విధ్వంసక బ్యాటింగ్ చేశారో అర్థమవుతుంది.

ఆదిలోనే చావుదెబ్బ

అనంతరం 241 పరుగుల విజయ లక్షంతో బరిలోకి దిగిన విండీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఓవర్‌లోనే బ్రండన్ కింగ్ ఔటయ్యాడు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి కేవలం 5 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే మరో ఓపెనర్ లెండిల్ సిమన్స్‌ను మహమ్మద్ షమీ పెవిలియన్‌కు పంపాడు. సిమన్స్ 7 పరుగులు మాత్రమే చేశాడు. అప్పటికి విండీస్ స్కోరు 17 పరుగులు మాత్రమే. అదే స్కోరు వద్ద పూరన్ కూడా దీపక్ చాహర్ బౌలింగ్‌లో డకౌట్ కావడంతో విండీస్ ఆశలు ఆవిరయ్యాయి. అయితే ఆ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ పోలార్డ్ ,అప్పటికే క్రీజ్‌లో ఉన్న హెట్‌మైర్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అడపాదడపా సిక్స్‌లు, ఫోర్లు బాదుతూ స్కోరుబోర్డును పరుగులెత్తించారు.

అయితే ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 74 పరుగులు జోడించాక హెట్‌మైర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 5 సిక్స్‌లు, ఒక బౌండరీతో హెట్‌మైర్ 41 పరుగులు చేశాడు.11వ ఓవర్‌లో వంద పరుగులు పూర్తి చేసిన విండీస్ ఆ తర్వాత కొద్ది సేపటికే మరో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ బౌలింగ్‌లో 8 పరుగులు చేసిన హోల్డర్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ మనీష్ పాండేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో సాధించాల్సిన రన్‌రేట్ భారీగా పెరిగిపోయింది. అయినప్పటికీ పోలార్డ్ తన పోరాటం విరమించలేదు. వరస సిక్స్‌లు, ఫోర్లతో భారత బౌలర్లపై ఎదురుదాడి సాగించాడు.

ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అయితే 68 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్‌కు క్యాచ్ ఇచ్చి ఔటవడంతో విండీస్ ఆశలు ఆడుగంటాయి. తర్వాత వచ్చిన వారిలో వాల్ష్11 పరుగులు, పియరే 6 పరుగులు చేసి ఔటవగా, విలియమ్స్(13),కాట్రెల్ (4) నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో దీపక్ చాహర్, షమీ, భువీ, కుల్దీప్ యాదవ్‌లు తలా రెండు వికెట్లు సాధించారు. ఈ విజయంలో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2 1తేడాతో సొంతం చేసుకుంది.

India beat West Indies by 67 runs to win

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వాంఖడేలో పరుగుల వరద appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: