సిఎంఆర్‌ఎఫ్‌కు రూ.లక్ష విరాళం ఇచ్చిన విద్యార్థులు

హైదరాబాద్: నలుగురు ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.లక్ష విరాళం అందించారు. ఈ మేరకు బుధవారం చిరేక్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు విశ్రుత్ దేవిరెడ్డి, శ్రేయ గోపరాజు, ఓక్రిడ్జ్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు రోహన్ రెడ్డి, శివాని తల్లూరిలుఐటి శాఖ మంత్రి కెటిఆర్‌ను కలిసి చెక్కును అందించారు. అక్టోబర్ 31న ఏర్పాటుచేసిన హెల్లోవీన్ పార్టీ ద్వారా వచ్చిన రూ.5లక్షల్లో రూ.4లక్షలను ఇంపాక్ట్ క్యాన్సర్ ఫౌండేషన్‌కు అందించారు. మిగతా రూ.లక్షను కెటిఆర్ ద్వారా సిఎంఆర్‌ఎఫ్‌కు అందించారు. […] The post సిఎంఆర్‌ఎఫ్‌కు రూ.లక్ష విరాళం ఇచ్చిన విద్యార్థులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: నలుగురు ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.లక్ష విరాళం అందించారు. ఈ మేరకు బుధవారం చిరేక్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు విశ్రుత్ దేవిరెడ్డి, శ్రేయ గోపరాజు, ఓక్రిడ్జ్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు రోహన్ రెడ్డి, శివాని తల్లూరిలుఐటి శాఖ మంత్రి కెటిఆర్‌ను కలిసి చెక్కును అందించారు. అక్టోబర్ 31న ఏర్పాటుచేసిన హెల్లోవీన్ పార్టీ ద్వారా వచ్చిన రూ.5లక్షల్లో రూ.4లక్షలను ఇంపాక్ట్ క్యాన్సర్ ఫౌండేషన్‌కు అందించారు. మిగతా రూ.లక్షను కెటిఆర్ ద్వారా సిఎంఆర్‌ఎఫ్‌కు అందించారు.

ఈ సందర్బంగా విద్యార్థులను మంత్రి అభినందించారు. సమాజానికి ఎంతోసేవ చేయాల్సిన అవసరం ఎంతో ఉందని కెటిఆర్ తెలియజేశారు. సమాజసంక్షేమానికి అవసరమైన వాటిని గుర్తిస్తూ సహాయం అందించేందుకు కృషి చేయాలని వారికి మంత్రి విజప్తి చేశారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణకై దృష్టి సారించాలని వారికి సూచించారు. పరిసరాలను పరిశుభ్రపరిచేందుకు విద్యార్థులు బృందాలుగా ఏర్పడి పలు ప్రాంతాలను దత్తత తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా పారిశుద్ద నిర్వహణ పనులను పర్యవేక్షించాలని చెప్పారు.

కాలుష్యం బారిన పడిన ఏరియాల్లో సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి చొరవ తీసుకోవాలన్నారు. మురికివాడల్లో దోమల నిర్మూలనకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని చెప్పారు. ఈ క్రమంలో విద్యార్థులు కూడా తమవంతు బాధ్యతగా సమాజ వికాసానికి తోడ్పడాలని మంత్రి ఆకాంక్షించారు. మంత్రి సూచనలు, సలహాలు తప్పకుండా పాటిస్తామని, సమాజ సంక్షేమానికి పాటుపడతామని విద్యార్థినులు చెప్పారు. తమకు దిశనిర్దేశం చేసిన మంత్రి కెటిఆర్‌కు విద్యార్థినులు ధన్యవాదాలు తెలియజేశారు.

Inter students donated Rs 1 lakh to CMRF

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సిఎంఆర్‌ఎఫ్‌కు రూ.లక్ష విరాళం ఇచ్చిన విద్యార్థులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: