భార్య ఆత్మహత్య.. భర్తకు ఐదేళ్ల జైలు శిక్ష

హైదరాబాద్: భార్య ఆత్మహత్యకు కారణమైన వ్యక్తికి ఐదేళ్ల జైలు, రూ.5,000 జరిమానా విధిస్తూ ఎల్‌బి నగర్ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం… నగరంలోని సైదాబాద్, వినయ్ నగర్ కాలనీకి చెందిన హరికిషన్ తన సోదరి కరుణను సరూర్‌నగర్‌కు చెందిన గోవిందు శ్రీనివాస్‌తో 1994లో వివాహం చేశారు. వ్యాపారం చేసే శ్రీనివాస్, కరుణకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత రెండేళ్ల నుంచి ఆర్థిక సమస్యలు లేవనెత్తుతూ శ్రీనివాస్ తన భార్య కరుణను మానసికంగా, శారీరకంగా […] The post భార్య ఆత్మహత్య.. భర్తకు ఐదేళ్ల జైలు శిక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: భార్య ఆత్మహత్యకు కారణమైన వ్యక్తికి ఐదేళ్ల జైలు, రూ.5,000 జరిమానా విధిస్తూ ఎల్‌బి నగర్ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం… నగరంలోని సైదాబాద్, వినయ్ నగర్ కాలనీకి చెందిన హరికిషన్ తన సోదరి కరుణను సరూర్‌నగర్‌కు చెందిన గోవిందు శ్రీనివాస్‌తో 1994లో వివాహం చేశారు. వ్యాపారం చేసే శ్రీనివాస్, కరుణకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత రెండేళ్ల నుంచి ఆర్థిక సమస్యలు లేవనెత్తుతూ శ్రీనివాస్ తన భార్య కరుణను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడు.

వేధింపులకు తాళలేక నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. తల్లిదండ్రులు ఇంటికి తీసుకువచ్చి పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీ చేశారు. అయినా కూడా నిందితుడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు సరికదా మరింత వేధించడం ప్రారంభించాడు. కరుణ సోదరుడు మే,26,2014వ తేదీన సరూర్‌నగర్‌లోని ఆమె ఇంటికి వెళ్లాడు. తనను భర్త మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని వివరించింది. సోదరికి సర్ధిచెప్పి వెళ్లిపోయాడు. మరుసటి రోజే శ్రీనివాస్ తన భార్య కరుణను వేధించడంతో తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సరూర్‌నగర్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. కేసు దర్యాప్తు చేసిన ఎస్సై నరేందర్ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. సాక్షాలు పరిశీలించిన కోర్టు నిందితుడికి ఐదేళ్ల జైలు, రూ.5వేల జరిమానా విధించింది. నిందితుడికి శిక్ష పడేవిధంగా చేసిన పోలీసులను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అభినందించారు.

Man sentenced to five years in prison for wife suicide

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post భార్య ఆత్మహత్య.. భర్తకు ఐదేళ్ల జైలు శిక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: