ప్రతిపక్షం నోట పాకిస్థానీ భాష: మోడీ

న్యూఢిల్లీ: పౌరసత్వ (సవరణ) బిల్లుపై ప్రతిపక్షం పాకిస్థానీ భాష మాట్లాడుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ బుధవారం ఆరోపించారు. ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) వంటి పార్టీలు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్య చేశారు. ఈ ప్రతిపాదిత బిల్లు చరిత్రలో ‘సువర్ణాక్షరాలతో’ లిఖించబడుతుందని ఆయన ఉద్ఘాటించారు. ఆర్టికల్ 370 రద్దుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాదిరే ఈ బిల్లు కూడా చరిత్రాత్మకమైందని బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని […] The post ప్రతిపక్షం నోట పాకిస్థానీ భాష: మోడీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: పౌరసత్వ (సవరణ) బిల్లుపై ప్రతిపక్షం పాకిస్థానీ భాష మాట్లాడుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ బుధవారం ఆరోపించారు. ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) వంటి పార్టీలు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్య చేశారు. ఈ ప్రతిపాదిత బిల్లు చరిత్రలో ‘సువర్ణాక్షరాలతో’ లిఖించబడుతుందని ఆయన ఉద్ఘాటించారు. ఆర్టికల్ 370 రద్దుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాదిరే ఈ బిల్లు కూడా చరిత్రాత్మకమైందని బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోడీ అన్నారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి విలేకరులకు చెప్పారు.

ఇతర దేశాల్లో మతపరమైన హింస భరించలేక ఇక్కడికి వచ్చిన శరణార్థులు చాలాకాలం నుంచీ అస్థిరమైన, అనిశ్చితిజీవితం గడుపుతున్నారని, ఈ ప్రతిపాదిత బిల్లు చట్టమైన తర్వాత వారికి శాశ్వతమైన ఊరట లభిస్తుందని ప్రధాని చెప్పారు. బిల్లుపై వచ్చిన అపోహల్ని పటాపంచలు చేయాలని ప్రధాని మోడీ బిజెపి పార్లమెంట్ సభ్యులకు చెప్పారని పార్టీ వర్గాలు తెలిపాయి. బిల్లు పార్లమెంటు ఆమోదం పొందినంత మాత్రాన అంతా పూర్తనట్టు భావించకూడదని, బిల్లు గురించి వారు ప్రజలకు వివరించాలని మోడీ బిజెపి ఎంపీలకు చెప్పినట్టు తెలుస్తోంది.

Opposition speaking Pakistans language on Citizenship Bill

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రతిపక్షం నోట పాకిస్థానీ భాష: మోడీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: