చోరీకి పాల్పడ్డ మహిళ అరెస్టు

  వరంగల్ : చోరీలకు పాల్పడుతున్న ఓ మహిళను వరంగల్ మట్టెవాడ పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్ ఫేజ్-1కాలనీలో చోరీకి పాల్పడ్డ నిందితురాలు మేడిపెల్లి సరితను అరెస్ట్ చేసి ఆమె వద్ద నుండి రూ.10వేలు, ఒక మొబైల్ స్వాధీనం చేసుకున్నట్లు మట్టెవాడ ఇన్స్‌పెక్టర్ గణేష్ బుధవారం తెలిపారు. ఇన్స్‌పెక్టర్, సిసిఎస్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ ఫేజ్-1లో ఒక ఇంట్లో అద్దెకు ఉండే మేడిపెల్లి సరిత అద్దెకు ఉంటున్న వారి కదలికలను గమనించి నవంబర్ 18న […] The post చోరీకి పాల్పడ్డ మహిళ అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వరంగల్ : చోరీలకు పాల్పడుతున్న ఓ మహిళను వరంగల్ మట్టెవాడ పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్ ఫేజ్-1కాలనీలో చోరీకి పాల్పడ్డ నిందితురాలు మేడిపెల్లి సరితను అరెస్ట్ చేసి ఆమె వద్ద నుండి రూ.10వేలు, ఒక మొబైల్ స్వాధీనం చేసుకున్నట్లు మట్టెవాడ ఇన్స్‌పెక్టర్ గణేష్ బుధవారం తెలిపారు. ఇన్స్‌పెక్టర్, సిసిఎస్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ ఫేజ్-1లో ఒక ఇంట్లో అద్దెకు ఉండే మేడిపెల్లి సరిత అద్దెకు ఉంటున్న వారి కదలికలను గమనించి నవంబర్ 18న మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి ఉండి ఎవరు లేని సమయంలో కిటికిలో నుండి లోనికి వెళ్లి సెల్ఫ్‌లో పెట్టిన నగదు మొదటిసారి రూ.20 వేలు, రెండవసారి నవంబర్ 22వ తేదీన రూ.10 వేలు ఒక మొబైల్ దొంగలించుకొని పోయి ఆ తరువాత ఎవరికి అనుమానం రాకుండా అట్టి అద్దె ఇల్లు ఖాళీ చేసి అక్కడి నుండి డాక్టర్స్‌కాలనీ ఫేజ్-2లో మరొక ఇంట్లోకి మకాం మార్చి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుందని తెలిపారు.

ఈ క్రమంలో దొంగతనం జరిగిన విషయంలో బాధితుడు మట్టెవాడ పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మేరకు అనంతరం సిపి రవీందర్ ఆదేశాల మేరకు వరంగల్ సిసిఎస్ ఇన్స్‌పెక్టర్ రమేష్‌కుమార్, మట్టెవాడ పిఎస్ ఇన్స్పెక్టర్ గణేష్ సిబ్బందితో కలిసి నేరం జరిగిన ప్రదేశాన్ని సందర్శించి ఐటి కోర్ టీం సహాయంతో, సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్తురాలి ఆచూకీ సేకరించినట్లు తెలిపారు.

నమ్మకమైన సమాచారం మేరకు క్రైం ఎసిపి బాబురావు ఆదేశాల మేరకు డాక్టర్‌కాలనీ ఫేజ్-2లో అద్దెకుంటున్న ఇంటి వద్ద పట్టుకొని పంచుల సమక్షంలో విచారించి తను దొంగలించిన నగదులో కొంత భాగం రూ.10 వేలు, మొబైల్ స్వాధీనం చేసుకొని నిందితురాలిని అరెస్ట్ చేసి మహిళా పోలీస్ వారి ఎస్కార్ట్‌తో ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితురాలిని సకాలంలో గుర్తించి చోరీ అయిన సొత్తును, నిందితురాలిని పట్టుకొనడంలో ప్రతిభ కనబరించిన ఇన్స్‌పెక్టర్లు, సిసిఎస్ పోలీసులను సిపి రవీందర్ ఈసందర్భంగా అభినందించారు.

Woman arrested for theft

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చోరీకి పాల్పడ్డ మహిళ అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: