చిరుత పులి మృతి.. ఐదుగురు అనుమానితుల అరెస్టు

  ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ అటవీ ప్రాంతంలో చిరుతపులి మృతి చెందింది. బుధవారం అటవీశాఖ అధికారులు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అమాయక ఆదివాసులను అరెస్టు చేశారంటూ తుడుందెబ్బ నాయకులు పెద్ద సంఖ్యలో మధ్యాహ్నం ఇచ్చోడ అటవీ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులో గల అటవీ ప్రాంతాల్లో కొన్నాళ్లుగా […] The post చిరుత పులి మృతి.. ఐదుగురు అనుమానితుల అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ అటవీ ప్రాంతంలో చిరుతపులి మృతి చెందింది. బుధవారం అటవీశాఖ అధికారులు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అమాయక ఆదివాసులను అరెస్టు చేశారంటూ తుడుందెబ్బ నాయకులు పెద్ద సంఖ్యలో మధ్యాహ్నం ఇచ్చోడ అటవీ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులో గల అటవీ ప్రాంతాల్లో కొన్నాళ్లుగా చిరుతపులి సంచరిస్తోంది. బజార్‌హత్నూర్ మండలం ఉండం గ్రామ శివారులో పంట పొలాలకు రక్షణగా ఆదివాసులు అమర్చిన విద్యుత్ తీగలను తాకి మంగళవారం చిరుతపులి మృతి చెందినట్లు ఇచ్చోడ అటవీ శాఖ అధికారులు గుర్తించారు.

బుధవారం అధికారులు చిరుతపులి మృతి చెందిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం ఉమ్మడి ఉండం గ్రామానికి చెందిన ఏడుగురు గిరిజనులపై కేసు నమోదు చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయిన వారిలో చౌహాన్ నాందేవ్, పెందూర్ నాగేందర్, సోయం నాగేశ్వర్, సిడం సునిల్ ఉన్నారు. వీరి నుంచి చిరుతపులి గోర్లు, మీసాలు, శరీర భాగాలు స్వాధీనం చేసుకున్నామని ఇంచార్జి డిఎఫ్‌వో చంద్రశేఖర్ తెలిపారు. పరారీలో చౌహాన్ కృష్ణ, కిషన్ ఉన్నట్లు తెలిపారు. చిరుతపులిని పథకం ప్రకారం చంపారా? లేదా? అనే విషయం విచారణలో తేలుతుందని ఆయన తెలిపారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Five suspects arrested for killing leopard

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చిరుత పులి మృతి.. ఐదుగురు అనుమానితుల అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: