బెంగాల్ ప్రజలను విభజించేది లేదు : మమతాబెనర్జీ

డిఘా : వైవిధ్యం లోని సమైక్యత పశ్చిమబెంగాల్ రాష్ట్ర ఆత్మ అని, కులం, తెగ, మతాల వారీగా ప్రజలను విభజించేది లేదని అందరూ కలసి ఉండాలనేదే తమ నమ్మకమని రాష్ట్రముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నారు. మనమంతా ఒక కుటుంబమని, తనను వేర్పాటు చేశారని చెప్పే వారు ఎవరూ ఇక్కడ ఉండరని ఆమె అన్నారు. కోల్‌కతాలో నిర్వహించిన బెంగాల్ బిజినెస్ కాంక్లేవ్ సభలో ఆమె మాట్లాడారు. రాజ్యసభలో పౌరసత్వ బిల్లుపై చర్చ జరిగిన సందర్భంగా ఆమె ఈ ప్రకటన చేశారు. […] The post బెంగాల్ ప్రజలను విభజించేది లేదు : మమతాబెనర్జీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

డిఘా : వైవిధ్యం లోని సమైక్యత పశ్చిమబెంగాల్ రాష్ట్ర ఆత్మ అని, కులం, తెగ, మతాల వారీగా ప్రజలను విభజించేది లేదని అందరూ కలసి ఉండాలనేదే తమ నమ్మకమని రాష్ట్రముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నారు. మనమంతా ఒక కుటుంబమని, తనను వేర్పాటు చేశారని చెప్పే వారు ఎవరూ ఇక్కడ ఉండరని ఆమె అన్నారు. కోల్‌కతాలో నిర్వహించిన బెంగాల్ బిజినెస్ కాంక్లేవ్ సభలో ఆమె మాట్లాడారు. రాజ్యసభలో పౌరసత్వ బిల్లుపై చర్చ జరిగిన సందర్భంగా ఆమె ఈ ప్రకటన చేశారు. బంగ్లాదేశ్, భూటాన్,బ్రిటన్, పోలాండ్, అమెరికా, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్, రష్యా, ఇటలీ, చైనా తదితర 28 దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

హరీష్ నియోటియా, వైకె మోడీ, రుద్ర ఛటర్జీ, మయాంక్ జలాన్, సంజయ్ బుధియా,తదితరులు హాజరయ్యారు. జిడిపి వృద్ధి, నిరుద్యోగ శాతం తగ్గుదల, పారిశ్రామిక వృద్ధి, పేదరిక నిర్మూలన తదితర భారీ ఆర్థిక ప్రమాణాలు సాధించడంలో మిగతా రాష్ట్రాల కన్నా పశ్చిమబెంగాల్ చాలా మెరుగైన స్థానంలో ఉందని బెనర్జీ పేర్కొన్నారు. రాష్ట్రంలో భూ వినియోగ విధానం, భూసేకరణ నిధి, టూరిజం విధానం, ఐటి పాలసీ, టీ టూరిజం పాలసీ ఉన్నాయని వివరించారు. పెట్టుబడి దారులు ఈ రాష్ట్రానికి పెట్టుబడులతో రావాలని, వారు తమ స్వీట్‌హోమ్‌గా రాష్ట్రాన్ని భావించాలని, ఈమేరకు ప్రభుత్వం తమ పరిధి మేరకు సంపూర్ణ సహకారం అందిస్తుందని చెప్పారు. కౌలాలంపూర్, బ్యాంకాక్, సింగపూర్ మాదిరిగా పశ్చిమబెంగాల్ కూడా భారీ అంతర్జాతీయ లక్ష సాధనకు ప్రతిబింబంగా పేర్కొన్నారు.

We dont divide people in bengal says Mamata Banerjee

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బెంగాల్ ప్రజలను విభజించేది లేదు : మమతాబెనర్జీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: