ఆర్టీసీ సమ్మె కాలంలో 5 లక్షలు హాంఫట్

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె కాలాన్ని తనకు అనువుగా మార్చుకున్నాడో ఓ తాత్కాలిక ఉద్యోగి. ఏకంగా ఆర్టీసీ నుంచి ఐదు లక్షల రూపాయలకు టోకరా వేశాడు. బస్సు పాసుల కలెక్షన్ పేరిట వచ్చిన ఆ డబ్బును హాంఫట్ చేశాడు. ఇందు నిమిత్తం నకిలీ ఆధారాలను సేకరించాడు. అయితే దురదృష్టవశాత్తూ దొరికిపోయి కేసుల్లో ఇరుక్కున్నాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ బస్ డిపోలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అసలేం జరిగింది? ఆర్టీసీలో బస్సు పాసుల జారీ చేసే కాంట్రాక్టును […] The post ఆర్టీసీ సమ్మె కాలంలో 5 లక్షలు హాంఫట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె కాలాన్ని తనకు అనువుగా మార్చుకున్నాడో ఓ తాత్కాలిక ఉద్యోగి. ఏకంగా ఆర్టీసీ నుంచి ఐదు లక్షల రూపాయలకు టోకరా వేశాడు. బస్సు పాసుల కలెక్షన్ పేరిట వచ్చిన ఆ డబ్బును హాంఫట్ చేశాడు. ఇందు నిమిత్తం నకిలీ ఆధారాలను సేకరించాడు. అయితే దురదృష్టవశాత్తూ దొరికిపోయి కేసుల్లో ఇరుక్కున్నాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ బస్ డిపోలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

అసలేం జరిగింది?

ఆర్టీసీలో బస్సు పాసుల జారీ చేసే కాంట్రాక్టును నెటెక్సల్ కంపెనీకి అప్పగించారు. బాన్సువాడ డిపో పరిధిలో బస్ పాస్ కౌంటర్‌లో పాసులు జారీ చేసి డబ్బులు మరుసటి రోజు బ్యాంకులో జమ చేసి రసీదును సంస్థకు పంపించే పనులను ముగ్గురు తాత్కాలిక ఉద్యోగులు నిర్వహిస్తారు. ఇటీవల జరిగిన ఆర్టీసీ సమ్మెను అదునుగా చేసుకుని డబ్బులు బ్యాంకులో కట్టకుండా నకిలీ బ్యాంకు రశీదులను తయారు చేసి వారిలో తూకారం అనే ఓ ఉద్యోగి సంస్థకు పంపించాడు. ఈ విధంగా దాదాపు 5 లక్షల వరకు జేబులో వేసుకున్నాడు.

ఆర్టిసి కార్మికులు ఉద్యోగాల్లో చేరిన తర్వాత బస్‌పాస్ డబ్బులు రశీదులు ఇవ్వాలని అడుగగా కంపెనీ సభ్యులు బాన్సువాడ డిపో అధికారులకు వాట్సాప్‌లో రశీదులు పంపించారు. ఆర్టిసి అధికారులు వారి ఖాతాలో చూడగ డబ్బులు జమకాకపోవడంతో రశీదులను తీసుకెళ్లి బ్యాంకులో చూపించారు. అయితే అవి చూసిన అధికారులు అవి నకిలీవని తేల్చారు. దీంతో సదరు నెటెక్సల్ కంపెనీ ఉద్యోగి తూకారాంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

5 Lakhs Looted During Rtc Strike in Banswada Bus Depot

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆర్టీసీ సమ్మె కాలంలో 5 లక్షలు హాంఫట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: