ఎపిలో దిశ చట్టం.. కేబినెట్ ఆమోదం

  హైదరాబాద్ : సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు, నిందితుల వెన్నులో వణుకు పుట్టేల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దిశా హత్యాచార ఘటన నేపథ్యంలో.. మహిళలపై అత్యాచారం చేస్తే ఉరిశిక్ష పడేలా చారిత్రాత్మక బిల్లుకు ఎపి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ క్రిమినల్ లా చట్టం 2019, ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌కోర్టు ఫర్‌ స్పెసిఫైడ్‌ అఫెన్సెస్‌ అగైనిస్ట్‌ విమెన్‌ అండ్‌ చిల్ట్రన్‌ యాక్ట్‌ 2019కి రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ చట్టం […] The post ఎపిలో దిశ చట్టం.. కేబినెట్ ఆమోదం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ : సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు, నిందితుల వెన్నులో వణుకు పుట్టేల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దిశా హత్యాచార ఘటన నేపథ్యంలో.. మహిళలపై అత్యాచారం చేస్తే ఉరిశిక్ష పడేలా చారిత్రాత్మక బిల్లుకు ఎపి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ క్రిమినల్ లా చట్టం 2019, ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌కోర్టు ఫర్‌ స్పెసిఫైడ్‌ అఫెన్సెస్‌ అగైనిస్ట్‌ విమెన్‌ అండ్‌ చిల్ట్రన్‌ యాక్ట్‌ 2019కి రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ చట్టం ప్రకారం అత్యాచారానికి పాల్పడినట్లు నేరం రుజువైతే దోషికి మరణశిక్ష విధిస్తారు. ఈ చట్టానికి దిశ అని పేరు పెట్టారు. కొత్త చట్టం ప్రకారం.. నేరాన్ని నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లో తీర్పు వెల్లడిస్తారు. వారంరోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి.. మరో 14 రోజుల్లో విచారణ పూర్తి చేస్తారు. మొత్తం 21 రోజుల్లో రేప్‌ కేసుపై జడ్జిమెంట్‌ వస్తుంది.

ప్రస్తుతం ఉన్న 4 నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తూ బిల్లు రూపొందించారు.  ఇక మహిళలు, చిన్నారులపై అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్‌ దాడులు, వేధింపులు, లైంగిక వేధింపులు తదితర నేరాలకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చేస్తారు. ఇక సామాజిక మాధ్యమాల్లో మహిళలను కించపరిచేలా, వారి గౌరవానికి భంగం కలిగించేలా పోస్టింగులు పెడితే కఠిన చర్యలు తప్పవు. అలాంటి వారిపై  సెక్షన్‌ 354 (ఇ) కింద చర్యలు తీసుకుంటారు. మొదటి సారి తప్పు చేస్తే 2 సంవత్సరాలు, రెండోసారి తప్పుచేస్తే నాలుగేళ్లు జైలుశిక్ష విధిస్తారు. అంతేకాదు పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే 354 (ఎఫ్‌) కింద చర్యలు  తీసుకుంటారు. ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తారు. పోస్కో చట్టం కింద ఇప్పటివరకూ ఉన్న 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకూ ఉన్న శిక్షను ఏడేళ్లకు పెంచారు.

Disha Act in AP

The post ఎపిలో దిశ చట్టం.. కేబినెట్ ఆమోదం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: