స‌మ‌త కేసు.. ప్ర‌త్యేక కోర్టుకు హైకోర్టు ఆమోదం

  హైద‌రాబాద్: దిశ ఘ‌ట‌న త‌ర్వాత స‌మ‌త కేసులో కూడా స‌త్వ‌ర న్యాయం అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సిఎం కెసిఆర్ ఆదేశించిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ప్ర‌త్యేక కోర్టును ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు హైకోర్టు ఆమోదం తెలిపింది. దీంతో ప్ర‌త్యేక కోర్టు ఏర్పాటు చేస్తూ న్యాయ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఐద‌వ‌ అదనపు సెషన్స్‌, ఆదిలాబాద్ జిల్లా న్యాయస్థానాన్ని ప్రత్యేక కోర్టుగా ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్త‌ర్వులో పేర్కొన్నారు. కుమ్రం భీం- ఆసిఫాబాద్ జిల్లా […] The post స‌మ‌త కేసు.. ప్ర‌త్యేక కోర్టుకు హైకోర్టు ఆమోదం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైద‌రాబాద్: దిశ ఘ‌ట‌న త‌ర్వాత స‌మ‌త కేసులో కూడా స‌త్వ‌ర న్యాయం అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సిఎం కెసిఆర్ ఆదేశించిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ప్ర‌త్యేక కోర్టును ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు హైకోర్టు ఆమోదం తెలిపింది. దీంతో ప్ర‌త్యేక కోర్టు ఏర్పాటు చేస్తూ న్యాయ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఐద‌వ‌ అదనపు సెషన్స్‌, ఆదిలాబాద్ జిల్లా న్యాయస్థానాన్ని ప్రత్యేక కోర్టుగా ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్త‌ర్వులో పేర్కొన్నారు. కుమ్రం భీం- ఆసిఫాబాద్ జిల్లా ఎల్లపటూర్ స‌మ‌త కేసులో ప్రత్యేక‌ కోర్టు ఏర్పాటు కావడంతో రోజువారీ పద్ధతిలో విచారణ జరిపి, నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్న‌ట్లు న్యాయశాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్ర‌భుత్వం శాంతి భ‌ద్ర‌త‌లకు అధిక ప్రాధ‌న్య‌తనిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు.

 

Special Court to hear the Samatha case

The post స‌మ‌త కేసు.. ప్ర‌త్యేక కోర్టుకు హైకోర్టు ఆమోదం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: