భారతీయ ముస్లింలకు ఆందోళన అనవసరం

న్యూఢిల్లీ:భారతదేశ పౌరులైన ముస్లిములు అలాగే కొనసాగుతారని, వారి పట్ల వివక్ష ఉండబోదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. బుధవారం రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లు(సిఎబి)పై చర్చలో ఆయన మాట్లాడుతూ ఇతర దేశాల నుంచి వచ్చి భారతదేశంలో నివసిస్తున్న ముస్లిములకు భారత పౌరసత్వం ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. భారతదేశంలోని ముస్లిం పౌరులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు. తాము ప్రవేశపెట్టిన ఈ బిల్లు భారతదేశంలోని ముస్లిములకు వ్యతిరేకమని కొందరు […] The post భారతీయ ముస్లింలకు ఆందోళన అనవసరం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ:భారతదేశ పౌరులైన ముస్లిములు అలాగే కొనసాగుతారని, వారి పట్ల వివక్ష ఉండబోదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. బుధవారం రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లు(సిఎబి)పై చర్చలో ఆయన మాట్లాడుతూ ఇతర దేశాల నుంచి వచ్చి భారతదేశంలో నివసిస్తున్న ముస్లిములకు భారత పౌరసత్వం ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. భారతదేశంలోని ముస్లిం పౌరులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు. తాము ప్రవేశపెట్టిన ఈ బిల్లు భారతదేశంలోని ముస్లిములకు వ్యతిరేకమని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన పిలుపునిచ్చారు.

రాజ్యాంగం ప్రకారమే నరేంద్ర మోడీ ప్రభుత్వం నడుచుకుంటోందని, దేశంలోని మైనారిటీలకు సంపూర్ణ రక్షణ ఉంటుందని ఆయన చెప్పారు. భారతదేశంలో నివసిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లోని మతపరంగా అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన ప్రజలకు భారత పౌరసత్వం ఇస్తామని ఆయన చెప్పారు. బిజెపి ఎన్నికల ప్రణాళికలో పౌరసత్వ సవరణ బిల్లును తీసుకొస్తామని వాగ్దానం చేశామని, ఆ ప్రకారమే దానికి చట్టబద్ధత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అమిత్ షా అన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలలో మతపరమైన మైనారిటీల జనాభా దాదాపు 20 శాతం చొప్పున తగ్గిపోయిందని, అక్కడి మైనారిటీలలో చాలా మంది హత్యకు గురికావడమో లేదా ఆశ్రయం కోసం భారత్‌కు పారిపోవడమో జరిగిందని ఆయన అన్నారు.

Amit Shah moves CAB in RS

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post భారతీయ ముస్లింలకు ఆందోళన అనవసరం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: