రేప్…. గర్భవతని తెలియగానే గ్యాస్ నూనె పోసి నిప్పంటించాడు…

పాట్నా: బిహార్ రాష్ట్రం చంపారణ్ జిల్లాలో మరో ఉన్నావో ఘటన చోటుచేసుకుంది. అమ్మాయిపై అత్యాచారం చేసి అనంతరం ఆమె గర్భవతి కావడంతో ఆమెపై కిరోసిన్ పోసి తగలబెట్టిన సంఘటన చంపారణ్ జిల్లాలోని నర్కతియాగంజ్ సమీపంలో గల గ్రామంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం బాధితురాలు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ఓ కుటుంబంలో తన ఇద్దరు కుమారులు కూతురు కలిసి నివసిస్తోంది. ఇద్దరు కుమారుల ఉపాధి నిమిత్తం నేపాల్‌కు వెళ్లారు. ఆమె భర్త ఐదు నెలల […] The post రేప్…. గర్భవతని తెలియగానే గ్యాస్ నూనె పోసి నిప్పంటించాడు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

పాట్నా: బిహార్ రాష్ట్రం చంపారణ్ జిల్లాలో మరో ఉన్నావో ఘటన చోటుచేసుకుంది. అమ్మాయిపై అత్యాచారం చేసి అనంతరం ఆమె గర్భవతి కావడంతో ఆమెపై కిరోసిన్ పోసి తగలబెట్టిన సంఘటన చంపారణ్ జిల్లాలోని నర్కతియాగంజ్ సమీపంలో గల గ్రామంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం బాధితురాలు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ఓ కుటుంబంలో తన ఇద్దరు కుమారులు కూతురు కలిసి నివసిస్తోంది. ఇద్దరు కుమారుల ఉపాధి నిమిత్తం నేపాల్‌కు వెళ్లారు. ఆమె భర్త ఐదు నెలల క్రితం చనిపోవడంతో తన కూతురుతో కలిసి కూలిగా వ్యవసాయ పనులకు వెళ్తోంది. అమ్మాయిపై యజమాని కుమారుడు అర్మాన్ కన్నేశాడు. తల్లి తోడుగా లేనప్పుడు ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమె గర్భవతి కావడంతో ఒంటరిగా ఉన్నప్పుడు ఇంట్లోకి చొరబడి ఆమెపై అర్మాన్ గ్యాస్ నూనె పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను నర్కతిగంజ్ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Man Torche Girl with Kerosene her Rape in Champaran,He dragged her to sugarcane fields and raped her, promise Marry Her, Then she is Pregnant ablize

The post రేప్…. గర్భవతని తెలియగానే గ్యాస్ నూనె పోసి నిప్పంటించాడు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: