ఉల్లి చోరీ చేసి చిక్కిన ఇద్దరు దొంగలు!

  ముంబై: ఒక పక్క ఉల్లి ధరలు సామాన్యుడి కళ్లలో నీళ్లు తెప్పిస్తుంటే మరో పక్క ఉల్లిపాయలు కొనలేక కొందరు దొంగతనాలకు కూడా పాల్పడుతున్నారు. తాజాగా ముంబైలోని డోంగ్రి ప్రాంతంలో ఉల్లి, బంగాళా దుంపలు అమ్మే ఒక వ్యాపారి దుకాణం నుంచి 148 కిలోల ఉల్లిని చోరీ చేసిన ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. రూ. 21,160 విలువ చేసే 148 కిలోల ఉల్లిపాయలు అక్బర్ షేక్ అనే వ్యాపారి దుకాణం నుంచి డిసెంబర్ 5వ […] The post ఉల్లి చోరీ చేసి చిక్కిన ఇద్దరు దొంగలు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముంబై: ఒక పక్క ఉల్లి ధరలు సామాన్యుడి కళ్లలో నీళ్లు తెప్పిస్తుంటే మరో పక్క ఉల్లిపాయలు కొనలేక కొందరు దొంగతనాలకు కూడా పాల్పడుతున్నారు. తాజాగా ముంబైలోని డోంగ్రి ప్రాంతంలో ఉల్లి, బంగాళా దుంపలు అమ్మే ఒక వ్యాపారి దుకాణం నుంచి 148 కిలోల ఉల్లిని చోరీ చేసిన ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. రూ. 21,160 విలువ చేసే 148 కిలోల ఉల్లిపాయలు అక్బర్ షేక్ అనే వ్యాపారి దుకాణం నుంచి డిసెంబర్ 5వ తేదీన ఇద్దరు దొంగలు కాజేశారు. సిసిటివి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఆ ఇద్దరు ఉల్లి దొంగలను అరెస్టు చేశారు. ముంబైలో ప్రస్తుతం కిలో ఉల్లి రూ. 160-170 పలుకుతోంది. బంగారంతో పోటీపడుతున్న ఉల్లిని కొనలేక చాలామంది వాటి వాడకాన్ని తగ్గించేయగా మరికొందరు కూరగాయల షాపులలో వాటిని కాజేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కోల్‌కతాలోని బోల్‌పూర్‌లో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక రేషన్ షాపులో కిలో ఉల్లి రూ. 59కి విక్రయిస్తుండగా గత శనివారం 5 కిలోల ఉల్లిని కొనుగోలు చేసిన ఒక వ్యక్తి డబ్బులు చెల్లించకుండానే అక్కడ నుంచి ఉడాయించాడు. ఉల్లిని విక్రయిస్తున్న రేషన్ షాపుల వద్ద కిలోమీటర్ల మేర ప్రజలు బారులు తీరి నిలబడుతున్నారు.

Two men arrested for stealing onions in Mumbai, Heavy demand for onions still continuing in Maharastra and other states

The post ఉల్లి చోరీ చేసి చిక్కిన ఇద్దరు దొంగలు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: