దృశ్యం సినిమా…. భార్యను ప్రియురాలితో కలిసి చంపి…ఫోన్‌ను ట్రైన్‌లో పడేసి

  తిరువనంతపురం: ప్రియుడు, ప్రియురాలు దృశ్యం సినిమాను ఆదర్శంగా తీసుకొని మర్డర్‌కు ప్లాన్ వేశారు. ప్రియుడు తన ప్రియురాలుతో కలిసి భార్యను చంపి దృశ్యం సినిమా కథను పోలీసులకు చూపించారు. పోలీసులు రెండు నెలలు విచారణ జరిపి నిందితులు పట్టుకున్నారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఉదయ్‌పెర్రర్ ప్రాంతంలో ఎర్నాకుళం ప్రేమ్ కుమార్‌, విద్యా అనే దంపతులు ఉన్నారు. పాత విద్యార్థుల సమ్మేళనంలో భాగంగా ప్రేమ కుమార్ తన క్లాస్‌మెంట్ సునీత బేబీతో పరిచయం ఏర్పడింది. సునీత […] The post దృశ్యం సినిమా…. భార్యను ప్రియురాలితో కలిసి చంపి… ఫోన్‌ను ట్రైన్‌లో పడేసి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

తిరువనంతపురం: ప్రియుడు, ప్రియురాలు దృశ్యం సినిమాను ఆదర్శంగా తీసుకొని మర్డర్‌కు ప్లాన్ వేశారు. ప్రియుడు తన ప్రియురాలుతో కలిసి భార్యను చంపి దృశ్యం సినిమా కథను పోలీసులకు చూపించారు. పోలీసులు రెండు నెలలు విచారణ జరిపి నిందితులు పట్టుకున్నారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఉదయ్‌పెర్రర్ ప్రాంతంలో ఎర్నాకుళం ప్రేమ్ కుమార్‌, విద్యా అనే దంపతులు ఉన్నారు. పాత విద్యార్థుల సమ్మేళనంలో భాగంగా ప్రేమ కుమార్ తన క్లాస్‌మెంట్ సునీత బేబీతో పరిచయం ఏర్పడింది. సునీత కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి భర్తకు దూరంగా ఉంటుంది. దీంతో సునీత, ప్రేమ కుమార్ మధ్య వివాహేతర సంబంధం నడుస్తోంది. సునీత తనని పెళ్లి చేసుకోవాలని చెప్పడంతో అడ్డుగా ఉన్న భార్య విద్యాను చంపాలనుకున్నారు. తన భార్య కు ఫంక్షన్ ఉందని ప్రైవేటు విల్లాకు పిలిపించుకున్నారు. అనంతరం ఆమెకు బాగా మద్యం తాగించి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం తమిళనాడులోని తిరునల్‌వెళ్లి ప్రాంతం వెల్లూరు సమీపంలో గల అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. అనంతరం సెప్టెంబర్ 23న తన భార్య కనిపించడం లేదని గత కొన్ని సంవత్సరాల ఉదయమ్‌పెరర్‌లలో నివసిస్తున్నామని తెలిపారు. తన కుమారుడు గోవాలో చదువుతున్నాడని పలుమార్లు గోవాకు వెళ్లిందని తెలిపాడు. ఆమె చదువు అంతా గోవాలోని సాగిందని పోలీసులకు తెలిపాడు. విద్యా ఫోన్‌ను స్విచ్ఛ్ ఆన్ చేసి తిరువనంతపురం నుంచి ముంబయికి వెళ్లే నెత్రావతి రైలులోని డస్ట్‌బిన్‌లో పడేశారు.  బాధితురాలు ఫోన్ ట్రేస్ చేయగా మంగళూరులో ఉన్నట్టు తెలిసింది. అంతకుముందు పోలీసులు విద్యా, ప్రేమ్ కుమార్ ట్రేస్ చేయగా తిరువనంతపురంలో ఉన్నట్టు తెలిసింది. వెంటనే పోలీసులకు అనుమానం వచ్చి తనదైన శైలిలో ప్రశ్నించగా నిజాలను ఒప్పుకున్నాడు. దృశ్యం సినిమా ఆధారం చేసుకొని ఈ మర్డర్ చేశామని ఆధారాలు దొరక్కకుండా చేశామని పోలీసులు విచారణలో ప్రియుడు, ప్రియరాలు ఒప్పుకున్నారు.

Drishyam Cinema Murder in kerala, Husband Killled his Wife with Lover in Udayamperoor police in Ernakulam.

 

Drishyam Cinema Murder in kerala

The post దృశ్యం సినిమా…. భార్యను ప్రియురాలితో కలిసి చంపి… ఫోన్‌ను ట్రైన్‌లో పడేసి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: