ఆర్‌డిఒ ఆఫీసు సామాగ్రి జప్తు

  భవనం కూల్చివేత బాధితునికి పరిహారం చెల్లింపుల్లో నిర్లక్షం కోర్టు ఆదేశాలతో జప్తు జగిత్యాల : కోర్టు ఆదేశాల మేరకు ఆర్‌డిఒ కార్యాలయ సామాగ్రిని కోర్టు అధికారులు, సిబ్బంది మంగళవారం జప్తు చేశారు. కార్యాలయంలోని కంప్యూటర్లు, ఇనుప అల్మారాలు తదితర సామగ్రిని జప్తు చేసి కోర్టుకు తరలించారు. డాక్టర్ సుధాకర్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌లో 1997లో ఆస్పత్రి భవన నిర్మాణం చేపట్టగా, ప్రభుత్వానికి చెందిన భూమిలో నిర్మాణ పనులు చేపడుతున్నారంటూ అప్పటి రెవెన్యూ అధికారులు నిర్మాణ పనులను […] The post ఆర్‌డిఒ ఆఫీసు సామాగ్రి జప్తు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

భవనం కూల్చివేత బాధితునికి పరిహారం చెల్లింపుల్లో నిర్లక్షం
కోర్టు ఆదేశాలతో జప్తు

జగిత్యాల : కోర్టు ఆదేశాల మేరకు ఆర్‌డిఒ కార్యాలయ సామాగ్రిని కోర్టు అధికారులు, సిబ్బంది మంగళవారం జప్తు చేశారు. కార్యాలయంలోని కంప్యూటర్లు, ఇనుప అల్మారాలు తదితర సామగ్రిని జప్తు చేసి కోర్టుకు తరలించారు. డాక్టర్ సుధాకర్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌లో 1997లో ఆస్పత్రి భవన నిర్మాణం చేపట్టగా, ప్రభుత్వానికి చెందిన భూమిలో నిర్మాణ పనులు చేపడుతున్నారంటూ అప్పటి రెవెన్యూ అధికారులు నిర్మాణ పనులను అడ్డుకోవడంతో పాటు నిర్మించిన పిల్లర్లను కూల్చివేశారు. దీంతో ఆ వైద్యుడు కోర్టును ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కోరాడు. అలాగే తను నిర్మించుకుంటున్న భవనాన్ని కూల్చివేసి నష్టం కలిగించారని, అలాగే పరువుకు భంగం కలిగించారంటూ రెవెన్యూ అధికారులపై 1998లో మరో కేసు వేశారు.

విచారించిన కోర్టు అది ప్రభుత్వ భూమి కాదని తేల్చడంతో పాటు నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చివేసి పరువుకు భంగం కలిగించినందుకు గాను రూ. 26 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది. పలుమార్లు ఆర్‌డిఒ కార్యాలయానికి కోర్టు నోటీసులు పంపడంతో రెవెన్యూ అధికారులు పరువు నష్టం కింద రూ. 5 లక్షలు చెల్లించారు. తనకు రావాల్సిన పరిహారం డబ్బులు అందకపోవడం పట్ల డాక్టర్ సుధాకర్‌రెడ్డి 2007లో రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా, విచారణ చేపట్టిన కోర్టు పరువు నష్టం, భవనం కూల్చివేసి నష్టం కలిగించినందుకు గాను రూ. 27 లక్షలు పరిహారం కింద చెల్లించాలని 2008లో కోర్టు తీర్పును వెలువరించింది.

అయినా రెవెన్యూ అధికారులు పరిహారం చెల్లించకుండా నిర్లక్షంగా వ్యహరించడం పట్ల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆర్‌డిఒ కార్యాలయ ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకుని ఆర్‌డిఒ ఆఫీసులోని కంప్యూటర్లు, ఇతర సామగ్రి, ఇనుప అల్మారాలను జప్తు చేసి వ్యాన్‌లో జగిత్యాల కోర్టుకు తరలించారు.

RDO office Things Foreclosure

The post ఆర్‌డిఒ ఆఫీసు సామాగ్రి జప్తు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: