సమ్‌థింగ్ స్పెషల్‌గా క్లైమాక్స్

  దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. స్టార్ హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు ఈ సినిమా కోసం పూర్తి సమయం కేటాయిస్తుండడంతో షూటింగ్ చకచకా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ పోర్షన్ చిత్రీకరణ సాగుతోందని తెలిసింది. విశాఖ మన్యం ప్రాంతంలోని లిండల్లాపల్లి, మోదాపల్లి మండలాల్లోని కాఫీ తోటలలో ఈ క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఆరు రోజుల పాటు ఈ ప్రదేశాల్లో చిత్రీకరణ కొనసాగుతుందని అంటున్నారు. బ్రిటిష్ వారితో కథానాయకులు పోరాడే సన్నివేశాలు […] The post సమ్‌థింగ్ స్పెషల్‌గా క్లైమాక్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. స్టార్ హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు ఈ సినిమా కోసం పూర్తి సమయం కేటాయిస్తుండడంతో షూటింగ్ చకచకా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ పోర్షన్ చిత్రీకరణ సాగుతోందని తెలిసింది. విశాఖ మన్యం ప్రాంతంలోని లిండల్లాపల్లి, మోదాపల్లి మండలాల్లోని కాఫీ తోటలలో ఈ క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఆరు రోజుల పాటు ఈ ప్రదేశాల్లో చిత్రీకరణ కొనసాగుతుందని అంటున్నారు. బ్రిటిష్ వారితో కథానాయకులు పోరాడే సన్నివేశాలు ప్రేక్షకులను థ్రిల్ చేసేలా ఉంటాయట.

అయితే ఈ షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు రాకుండా రాజమౌళి టీమ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం. ఈ సినిమాలో అలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవగణ్, రాహుల్ రామకృష్ణ, సముద్రఖని ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నిర్మాత డివివి దానయ్య ఈ సినిమాను రూ. 350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ‘బాహుబలి’ ఫ్రాంచైజీ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

RRR Climax as Something Special

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సమ్‌థింగ్ స్పెషల్‌గా క్లైమాక్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: