బద్ధకం వదలండి!

  చలికాలం అంటేనే బద్ధకానికి మరో పేరు. అప్పటివరకూ చక్కగా వ్యాయామం చేసేవారు ఈ కాలంలో మాత్రం ఉదయాన్నే లేవాలంటే చలికి భయపడిపోతుంటారు. శీతాకాలంలోనే శరీరం చురుగ్గా ఉండాలంటే కచ్చితంగా వాకింగ్, జాగింగ్‌లాంటి వ్యాయామాలు చాలా ముఖ్యం అంటున్నారు ఫిట్‌నెస్ ట్రైనర్లు. చలికాలం కదా అని వర్కవుట్స్‌ని వాయిదా వేయొద్దని సలహా ఇస్తున్నారు. శరీరం మన మాట వినాలంటే దానికి తగిన శ్రమ అవసరం. ఆఫీసుల్లో కంప్యూటర్ మీద చేసే పని కాబట్టి అక్కడ శారీరక శ్రమ […] The post బద్ధకం వదలండి! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

చలికాలం అంటేనే బద్ధకానికి మరో పేరు. అప్పటివరకూ చక్కగా వ్యాయామం చేసేవారు ఈ కాలంలో మాత్రం ఉదయాన్నే లేవాలంటే చలికి భయపడిపోతుంటారు. శీతాకాలంలోనే శరీరం చురుగ్గా ఉండాలంటే కచ్చితంగా వాకింగ్, జాగింగ్‌లాంటి వ్యాయామాలు చాలా ముఖ్యం అంటున్నారు ఫిట్‌నెస్ ట్రైనర్లు. చలికాలం కదా అని వర్కవుట్స్‌ని వాయిదా వేయొద్దని సలహా ఇస్తున్నారు.

శరీరం మన మాట వినాలంటే దానికి తగిన శ్రమ అవసరం. ఆఫీసుల్లో కంప్యూటర్ మీద చేసే పని కాబట్టి అక్కడ శారీరక శ్రమ ఉండదు. చాలా మంది చలికాలం అనగానే వ్యాయామాన్ని కొన్ని రోజుల పాటు వదిలేస్తుంటారు. ఒకవేళ చలికి బయటకు వెళ్లకపోయినా ఇంట్లోనే వర్కవుట్లను చేయమంటున్నారు నిపుణులు. చలికాలంలో ఇష్టాన్ని కలిగించే కొన్ని వర్కవుట్ల గురించి చెబుతున్నారు ట్రైనర్లు.

* చలి ఎక్కువగా ఉన్నప్పుడు వ్యాయామం చేసే సమయంలో స్కాట్స్, పుషప్స్, ప్లాంక్స్ వంటివి చేసుకోవాలి. ఒక్కొక్కటి పది నిముషాల చొప్పున అంటే రోజుకు అరగంట పాటు వీటిని చేయాలి. ఒకసారి ట్రైనర్ దగ్గర నేర్చుకుని ఎవరైనా ఇంటి దగ్గరే సాధన చేయొచ్చు.
* ఏదైనా వ్యాయామం ఒక్కరే చేయాలంటే కచ్చితంగా విసుగొస్తుంది. అందుకనే సరదాగా కుటుంబ సభ్యులతో మొదలెట్టండి. ఇలా అందరూ కలిసి చేస్తే మరింత ఉత్సాహంగా ఉంటుంది. అందరికీ ఆరోగ్యం సొంతమవుతుంది.
* వర్కవుట్లకు రోజూ ఓ సమయాన్ని నిర్ణయించుకోండి. ఆ సమయానికి అందరూ వచ్చేలా ఏర్పాటుచేసుకోవాలి. ఇంట్లో చేసే జుంబా, ఏరోబిక్స్ లాంటివి ఎన్నో ఉన్నాయి. పాటలకు అనుగుణంగా స్టెప్స్ వేయడం వల్ల ఇటువంటివి అలసట రానీయకుండా ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి.

* వారాంతంలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆడేందుకు కొన్ని క్రీడలను ఎంపిక చేసుకోవాలి. ఇలాంటి సమయాల్లో ఫోన్‌లాంటి గ్యాడ్జెట్లను తప్పక పక్కన పెట్టేయాల్సిందే.
* చలికాలంలో జాగింగ్, వాకింగ్ చేసేవాళ్లు మరీ తెల్లవారుజామునే కాకుండా ఆరు దాటిన తర్వాత వెళ్లడం మంచిది. మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేస్తుంటే ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయట.
* యోగా, ధ్యానం వల్ల శరీరంతోపాటు మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.
ఇది ఇంట్లోనే చేసుకోవచ్చు. గురువు ద్వారా యోగాసనాలు చేయాలి. ఈ కాలంలో ఎదురయ్యే అనేక అనారోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం యోగా. ధ్యానం వల్ల ప్రశాంతత దొరుకుతుంది. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు చేయొచ్చు.

* వ్యాయామాలతోపాటు పోషకాలుండే ఆహారాన్ని తీసుకోవడం మరింత ముఖ్యం. ఈ కాలంలో దొరికే పండ్లు తీసుకోవాలి. బత్తాయి, నారింజ, జామ, బొప్పాయి లాంటివి తినాలి. విటమిన్ సి ముఖ్యం.
కొవ్వు తక్కువగా ఉన్నవి తీసుకోవాలి.
* నువ్వులు, పల్లీలు తినడం వల్ల ఇవి ఒంట్లో వేడిని పెంచుతాయి.
* వాతావరణం చల్లగా ఉంటుంది కనుక పెద్దగా దాహం వేయదు.
అలాగని నీళ్లు తక్కువ తాగడం తప్పు. వ్యాయామం చేసేవాళ్లు నీళ్లను మరింత ఎక్కువగా తాగాలి. శరీరాన్ని తేమగా ఉంచేందుకు నీళ్లు ఉపయోగపడతాయి.

Exercises in Winter are very important

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బద్ధకం వదలండి! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: