గోవాలో ఎంజాయ్

అందాల తార కాజల్‌కి టాలీవుడ్‌లో ఈ ఏడాది కలిసి రాలేదు. ఆమె తెలుగులో చేసిన రెండు సినిమాలు బోల్తా కొట్టాయి. తేజ దర్శకత్వంలో వచ్చిన ‘సీత’పై ఆమె చాలా ఆశలే పెట్టుకున్నప్పటికీ ఈ చిత్రం నిరాశపరిచింది. అలాగే ‘రణరంగం’ చిత్రం కూడా అనుకున్నంత విజయాన్ని దక్కించుకోలేకపోయింది. అయితే కాజల్ తమిళంలో నటించిన ‘కోమలి’ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తెలుగులో కాజల్‌కి ఇప్పుడు అనుకున్నంతగా అవకాశాలు లేవు. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘మోసగాళ్లు’ చిత్రంలో ఆమె […] The post గోవాలో ఎంజాయ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అందాల తార కాజల్‌కి టాలీవుడ్‌లో ఈ ఏడాది కలిసి రాలేదు. ఆమె తెలుగులో చేసిన రెండు సినిమాలు బోల్తా కొట్టాయి. తేజ దర్శకత్వంలో వచ్చిన ‘సీత’పై ఆమె చాలా ఆశలే పెట్టుకున్నప్పటికీ ఈ చిత్రం నిరాశపరిచింది. అలాగే ‘రణరంగం’ చిత్రం కూడా అనుకున్నంత విజయాన్ని దక్కించుకోలేకపోయింది. అయితే కాజల్ తమిళంలో నటించిన ‘కోమలి’ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తెలుగులో కాజల్‌కి ఇప్పుడు అనుకున్నంతగా అవకాశాలు లేవు. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘మోసగాళ్లు’ చిత్రంలో ఆమె నటిస్తోంది. ఇక తమిళంలో ‘పారిస్ పారిస్’తో పాటు హిందీలో కూడా ఓ చిత్రం చేస్తున్నట్లు తెలిసింది. కాగా కాజల్ ప్రస్తుతం గోవాలో ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తోంది. తన మిత్రులతో సంతోషంగా గడుపుతున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో షేర్ చేసుకుంది. ఓ ఫ్రెండ్ పెళ్లి కోసం ఈ బ్యూటీ గోవా వెళ్లినట్టు సమాచారం. కాజల్ తన మిత్రులతో ఆహ్లాదంగా గడుపుతున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Kajal Agarwal enjoy in Friends wedding at Goa

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గోవాలో ఎంజాయ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: