రేపే టీజర్

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ‘అల.. వైకుంఠపురంలో..’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పాటలు ఎంతో పాపులర్ అయ్యాయి. అల్లు అర్జున్ 19వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయనకు జోడీగా పూజాహెగ్డే నటిస్తోంది. అభిమానులు, సినీ జనాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చేస్తున్న ‘అల వైకుంఠపురంలో’ టీజర్ ఈనెల 11న విడుదల కానుంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న […] The post రేపే టీజర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ‘అల.. వైకుంఠపురంలో..’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పాటలు ఎంతో పాపులర్ అయ్యాయి. అల్లు అర్జున్ 19వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయనకు జోడీగా పూజాహెగ్డే నటిస్తోంది. అభిమానులు, సినీ జనాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చేస్తున్న ‘అల వైకుంఠపురంలో’ టీజర్ ఈనెల 11న విడుదల కానుంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకానుంది. టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్కర్, తనికెళ్ల భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, కల్యాణి నటరాజన్, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష, బ్రహ్మాజీ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కెమెరామెన్‌ః పి.ఎస్.వినోద్, సంగీతం: తమన్, ఎడిటర్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, ఫైట్స్: రామ్, -లక్ష్మణ్.

Ala Vikuntapuramlo movie teaser released on Dec 11

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రేపే టీజర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: