అది వినగానే కళ్లల్లో నుండి నీళ్లు వచ్చేశాయి

కె.ఎస్.రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఈనెల 13న విడుదల కానుంది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లపై డి.సురేష్ బాబు, విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విడుదల సందర్భంగా నిర్మాతలు డి.సురేష్ బాబు, విశ్వప్రసాద్‌తో ఇంటర్వూ విశేషాలు… అలా ఈ ప్రాజెక్ట్ ముందుకు… రచయిత జనార్దన మహర్షి ముందుగా ‘వెంకీ మామ’ కథను మాకు వినిపించారు. లైన్ పరంగా చాలా బాగుంది కానీ ట్రీట్‌మెంట్ పరంగా ఇంకా చాలా చేయాలనిపించింది. […] The post అది వినగానే కళ్లల్లో నుండి నీళ్లు వచ్చేశాయి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కె.ఎస్.రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఈనెల 13న విడుదల కానుంది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లపై డి.సురేష్ బాబు, విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విడుదల సందర్భంగా నిర్మాతలు డి.సురేష్ బాబు, విశ్వప్రసాద్‌తో ఇంటర్వూ విశేషాలు…
అలా ఈ ప్రాజెక్ట్ ముందుకు…
రచయిత జనార్దన మహర్షి ముందుగా ‘వెంకీ మామ’ కథను మాకు వినిపించారు. లైన్ పరంగా చాలా బాగుంది కానీ ట్రీట్‌మెంట్ పరంగా ఇంకా చాలా చేయాలనిపించింది. ఆ తరువాత ఆ లైన్‌ను కోన వెంకట్‌కి చెప్పి… ‘నువ్వు ఏమైనా చేయగలవా’ అంటే… అతను ‘కథ విని చాలా బాగుంది చేద్దాం’ అని వర్క్ చేయడం జరిగింది. అలా ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లింది.
కళ్లలో నీళ్లు వచ్చేశాయి…
దర్శకుడు బాబీ గురించి కోన వెంకటే చెప్పాడు. కోన చేసిన ట్రీట్‌మెంట్‌ను చూసి బాబీ తన శైలిలో స్క్రిప్ట్ వర్క్ చేశాడు. ఫైనల్‌గా ఓ రోజు వచ్చి ఈ కథకు సంబంధించి ఒక ఎపిసోడ్ చెప్పాడు. అది వినగానే కళ్లల్లో నుండి నీళ్లు వచ్చేశాయి. దీంతో ఇక ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాం.
హ్యాపీగా అనిపించింది…
‘వెంకీ మామ’ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తరువాత మంచి తెలుగు సినిమా చేశామనే ఫీలింగ్ కలిగింది. సినిమాలో గుడ్ ఎంటర్‌టైన్‌మెంట్, గుడ్ యాక్షన్, గుడ్ ఎమోషన్స్, గుడ్ ఫీలింగ్స్… ఇలా అన్ని అంశాలు చాలా బలంగా ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది.
అందుకే ఆలస్యమైంది…
మేము మొదట అక్టోబర్ రెండవ వారంలో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నాం. కానీ వెంకటేష్‌కి కాలు బెణికింది. దాంతో ఆ డేట్ మారింది. ఆ తరువాత రాశీఖన్నా డేట్స్ ఆలస్యం కావడంతో సినిమా మరింత వాయిదా పడింది. అయితే సంక్రాంతికి రిలీజ్ చేద్దామని చూస్తే అప్పటికే బన్నీ, మహేష్ సినిమాలు ప్లాన్ చేసుకున్నారు. చివరికి అందరితో చర్చించి డిసెంబర్ 13న అయితే బెస్ట్ అని నిర్ణయించుకున్నాం.
అభిరామ్ ‘అసురన్’లో నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. వాటిలో నిజం ఎంత?
అవి పూర్తి అవాస్తవం. ‘అసురన్’లో అభిరామ్ నటించట్లేదు. ప్రస్తుతం అభి యాక్టింగ్ లో ట్రైనింగ్ అవుతున్నాడు.
ఈ విషయంలో అక్షయ్‌కుమార్ బంగారం…
స్టార్ హీరోలు ఎక్కువ సినిమాలు చేయాలి. వాళ్లు చేసేలా నిర్మాతలు, డైరెక్టర్‌లు కూడా మంచి కంటెంట్‌తో వారి వద్దకు వెళ్లాలి. ఈ విషయంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ బంగారం అని చెప్పాలి. అతను సంవత్సరానికి మూడు, నాలుగు సినిమాలు చేస్తాడు. పైగా అన్ని రకాల సినిమాలు చేస్తాడు. నేడు బాలీవుడ్‌కి అతను చాలా కీలకం. అలాగే ఇక్కడ కూడా మన హీరోలు చేయాలి. రానున్న రోజుల్లో చేస్తారనే అనుకుంటున్నాను.

Producer D.Suresh babu Special Interview

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అది వినగానే కళ్లల్లో నుండి నీళ్లు వచ్చేశాయి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: