ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు

  ప్రముఖ సినీ నిర్మాత సి.కళ్యాణ్ 60వ పుట్టిన రోజు సోమవారం (డిసెంబర్ 9) జరుపుకుంటున్నారు.సి.కళ్యాణ్ ప్రస్తుతం బాలయ్యతో రూలర్ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సందర్భంగా ఆయనతో స్పెషల్ ఇంటర్వ్యూ… ఇప్పటి ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంది ? అందరికీ తెలిసిందే కదా. చిరంజీవిగారికి చెప్పాను. ఇండస్ట్రీకి ఒక పెద్ద […] The post ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రముఖ సినీ నిర్మాత సి.కళ్యాణ్ 60వ పుట్టిన రోజు సోమవారం (డిసెంబర్ 9) జరుపుకుంటున్నారు.సి.కళ్యాణ్ ప్రస్తుతం బాలయ్యతో రూలర్ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సందర్భంగా ఆయనతో స్పెషల్ ఇంటర్వ్యూ…

ఇప్పటి ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంది ?
అందరికీ తెలిసిందే కదా. చిరంజీవిగారికి చెప్పాను. ఇండస్ట్రీకి ఒక పెద్ద కావాలి.. దాసరి నారాయణగారి తరువాత ఆ స్థానాన్ని భర్తీ చెయ్యాలనే విషయం పై మాట్లాడను. కానీ ఇప్పటి పరిస్థితులు మరోలా ఉన్నాయి. ఏమైనా పాతరోజులకు ఇప్పటి రోజులకు మధ్య వ్యత్యాసం బాగా పెరిగింది. అందుకే కొన్ని సమస్యలను పరిష్కరించలేకపోతున్నాము. అందు లో చిన్న సినిమా థియేటర్స్ పరిస్థితి కూడా ఉంది.

చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకవు అనే సమస్య తీరుతుందా ?
ఇటీవల ఒక అరడజను చిన్న చిత్రాలు విడుదల అయ్యాయి. ఒక్క పెద్ద సినిమా కూడా లేదు. మరి ఆ చిన్న సినిమాలు కూడా లేకపోతే థియేట ర్స్‌కి, క్యూబ్ వారికి డబ్బు ఎలా వస్తుంది? చిన్న చిత్రాలు వస్తేనే వాతవరణం బాగుుంటుంది. థియేటర్స్ ని నమ్ముకున్న ఎంతోమంది కార్మికుల పరిస్థితి ఏమిటి ? సినిమా ఇండస్ట్రీకి డబ్బు ఎక్కడి నుండి వస్తోంది. పెద్ద సినిమాలు సంవత్సరానికి ఆడేవి చాలా తక్కువే. కొత్త నిర్మాతలు, చిన్న సినిమాలు లేకపోతే ఇండస్ట్రీనే లేదు.

కౌన్సిల్‌లో సమస్యలు ఏమిటి?
గిల్డ్ అని ఒకటి ఏర్పాటు చేశారు. దాని వల్ల ఉపయోగుం లేదు. అందుకే కౌన్సిల్ లో 70% మంది రెగ్యులర్‌గా సినిమాలు చేసేవాళ్ళే ఉండాలని రూల్ పెట్టాలి. అప్పుడే సినిమా నిర్మాణ విషయంలో ఒక పద్దతి ఉంటుంది.

మన సినిమాలకు అంతర్జాతీయ అవార్డ్స్ రాకపోవడానికి కారణం?
మన సినిమాలు అక్కడ పోటీని తట్టుకోలేకపోతున్నాయి. మనకు హోలీవుడ్ స్థాయి టెక్నీషియన్స్ లేకపోవడం కూడా ఒక కారణం. మనకంటే పెద్ద నేషన్ అయిన చైనా సినిమాలు సైతం అంతర్జాతీయ వేదికలపై కనిపించడం లేదు. కొరియా, అమెరికా చిత్రాలు ముఖ్యంగా అరత పొందుతున్నాయి. అక్కడ కొందరు ప్రత్యేకంగా ఇలాంటి చిత్రాలు తెరకెక్కించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

మనం ఎందుకు ఆ స్థాయికి ఎదగులేకపోతున్నాం?
తెలుగుు చిత్ర ప్రరిశ్రమలో ఒక హీరోకి అవార్డు వచ్చిందని తెలిసినటప్పుడు ఆ హీరో మినహా మిగుతా హీరోలెవరు ఆ కార్యక్రమానికి హాజరుకారు. ఆ వాతావరణం మారాలి. అందరూ ముందుకు రావాలనేదే నాకొరిక. ఒకరినొకరు సపోర్టు చేసుకుంటూ వెలితేనే పరిశ్రమ బాగుుంటుందని నమ్ముతాను

ప్రస్తుత సమాజంపై సినిమా ప్రభావం?
ఒక చెడ్డ సినిమా చూసి చెడిపోయినోడికి, ఒక మంచి సినిమా చూపించినంత మాత్రాన బుద్ధిమంతుడిలా మారిపోతాడా? సినిమాలో కంటే బయట ఆడపిల్లల వస్త్ర ధారణ దారుణంగా ఉంటుంది. మొబైల్ లో యువత ఏమి చూస్తున్నారో, ఏమి చేస్తున్నారో ఎవరికీ తెలియదు. సినిమా ప్రభావం సమాజంపై పడుతుంది అంటే నేను నమ్మను.

మరి దీనికి పరిష్కారం ఏమిటంటారు?
తల్లిదండ్రులు పిల్లల చర్యల పై దృష్టి పెట్టాలి. సంపాదన, ఉద్యోగుమే కాకుండా పిల్లలు ఆలోచనా ధోరణి ఎలా ఉంటుంది, వారు ఎటువైపు వెళ్తున్నారు గుమనించి అదుపులో పెట్టాలి.

రూలర్ గురించి చెప్పండి ?
‘రూలర్’ సినిమా సువర్ హిట్ అవ్వబోతుంది. బాలయ్య అభిమానులకు అలాగే అన్ని వర్గాల ప్రేక్షుకులకు పెద్ద పండుగు లాంటి సినిమా.

Special interview with C.Kalyan

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: