ఉన్నావ్ బాధితురాలి అంత్యక్రియలు పూర్తి

  అశ్రునయనాలతో ప్రజల తుది వీడ్కోలు కేసులో న్యాయంకోసం పోరాడతామన్న నాయకులు ఉన్నావ్ : ఐదుగురు దుండగులు సజీవ దహనం చేయడానికి పాల్పడిన కిరాతక చర్యలో కాలిన గాయాలతో ఢిల్లీ సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో మరణించిన 23 ఏళ్ల ఉన్నావ్ అత్యాచార బాధితురాలికి ఆదివారం ఆమె స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా అక్కడ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. తమ కుటుంబం పొలాల్లో తాత, అమ్మమ్మ సమాధులున్న చోట ఆమెకు అంత్యక్రియలు జరిగాయి. స్థానికులు, అధికారులు అంత్యక్రియలకు […] The post ఉన్నావ్ బాధితురాలి అంత్యక్రియలు పూర్తి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అశ్రునయనాలతో ప్రజల తుది వీడ్కోలు
కేసులో న్యాయంకోసం పోరాడతామన్న నాయకులు

ఉన్నావ్ : ఐదుగురు దుండగులు సజీవ దహనం చేయడానికి పాల్పడిన కిరాతక చర్యలో కాలిన గాయాలతో ఢిల్లీ సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో మరణించిన 23 ఏళ్ల ఉన్నావ్ అత్యాచార బాధితురాలికి ఆదివారం ఆమె స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా అక్కడ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. తమ కుటుంబం పొలాల్లో తాత, అమ్మమ్మ సమాధులున్న చోట ఆమెకు అంత్యక్రియలు జరిగాయి. స్థానికులు, అధికారులు అంత్యక్రియలకు హాజరయ్యారు. అంత్యక్రియలకు ముందు వివిధ రంగాలకు చెందిన గ్రామస్థులు తుది నివాళులర్పించారు.

సమాజ్‌వాది పార్టీ నాయకులు, ఉత్తరప్రదేశ్ కేబినెట్ మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, కమల్‌రాణి వరుణ్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా నిలబడుతుందని మౌర్య తెలిపారు. కమల్‌రాణి మాట్లాడుతూ ‘బేటీ పఢావో, బేటీ బచావో నినాదం అర్థవంతమైంది. బాధితురాలిపట్ల కిరాతకంగా వ్యవహరించిన నిందితులకు కఠిన శిక్ష పడుతుంది’ అన్నారు. ‘రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి బాగా క్షీణించింది. అమ్మాయిలు తమకు రక్షణ లేదని భావిస్తున్నారు. వాళ్ల ఎఫ్‌ఐఆర్‌లు రిజిస్టర్ చేయడం లేదు.

యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రాజీనామా చేయాలి’ అని సమాజ్‌వాది పార్టీ ఎంఎల్‌సి సునీల్ సింగ్ సాజన్ డిమాండ్ చేశారు. ఉన్నావ్ మాజీ ఎంపి, స్థానిక నాయకురాలు అన్ను టాండన్ మాట్లాడుతూ బాధితురాలికి న్యాయం కోసం పోరాడతామన్నారు. బాధితురాలి కుటుంబానికి ఆమె రూ.5 లక్షలు ఆర్థికసాయం చేశారు.అంతకు ముందు లక్నో డివిజనల్ కమిషనర్ ముకేష్ మెష్‌రాం మాట్లాడుతూ …బాధితురాలి కుటుంబానికి భద్రత, ఒక ఇల్లు కల్పిస్తామన్నారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న ఆమె సోదరికి ప్రత్యేక భద్రత ఉంటుందన్నారు.

Unnao rape victim buried next to grandparents

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఉన్నావ్ బాధితురాలి అంత్యక్రియలు పూర్తి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: