విండీస్ విజయం

  సిమన్స్, పూరన్ విధ్వంసం శివమ్ మెరుపులు వృథా రెండో టి20లో భారత్ ఓటమి తిరువనంతపురం : భారత్‌తో జరిగిన రెండో ట్వంటీ20లో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆదివారం తిరువనంతపురంలో జరిగిన మ్యాచ్‌లో విండీస్ జయకేతనం ఎగుర వేసింది. ఈ విజయంతో సిరీస్‌ను 11తో సమం చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. తర్వాత క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన […] The post విండీస్ విజయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సిమన్స్, పూరన్ విధ్వంసం
శివమ్ మెరుపులు వృథా
రెండో టి20లో భారత్ ఓటమి

తిరువనంతపురం : భారత్‌తో జరిగిన రెండో ట్వంటీ20లో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆదివారం తిరువనంతపురంలో జరిగిన మ్యాచ్‌లో విండీస్ జయకేతనం ఎగుర వేసింది. ఈ విజయంతో సిరీస్‌ను 11తో సమం చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. తర్వాత క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 18.3 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ లెండిల్ సిమన్స్ అద్భుత బ్యాటింగ్‌తో విండీస్‌ను గెలిపించాడు.

చెలరేగి ఆడిన సిమన్స్ 45 బంతుల్లోనే 4 భారీ సిక్సర్లు, మరో 4 ఫోర్లతో 67 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ ఎవిన్ లెవిస్ మూడు సిక్స్‌లు, మరో 3 ఫోర్లతో 40 పరుగులు చేసి తనవంతు పాత్ర పోషించాడు. ఇక, హెట్‌మెయిర్ 3 సిక్సర్లతో వేగంగా 23 పరుగులు చేశాడు. చివర్లో వికెట్ కీపర్ నికోలస్ పూరన్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లను హడలెత్తించిన పూరన్ 18 బంతుల్లోనే రెండు సిక్సర్లు, 4 ఫోర్లతో 38 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో విండీస్ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.

చెలరేగిన శివమ్
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ప్రత్యర్థి ముందు 171 పరుగుల క్లిష్టమైన లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆశించిన స్థాయిలో ఆరంభం లభించలేదు. ఓపెనర్ లోకేశ్ రాహుల్ (11) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన యువ ఆటగాడు శివమ్ దూబే ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మరోవైపు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ నిరాశ పరిచాడు. ఈసారి కూడా పెద్దగా ప్రభావం చూపలక పోయాడు. నిదానంగా ఆడిన రోహిత్ రెండు ఫోర్లతో 15 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు శివమ్ దూబే విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగి పోయాడు.

ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించిన శివమ్ వరుస ఫోర్లు, సిక్సర్లతో అలరించాడు. అతనికి కెప్టెన్ విరాట్ కోహ్లి సహకారం అందించాడు. భారీ సిక్సర్లు, బౌండరీలు కొడుతూ స్కోరును పరిగెత్తించాడు. కోహ్లి మాత్రం భారీ షాట్ల జోలికి వెళ్లకుండా రక్షణాత్మక బ్యాటింగ్ చేశాడు. మెరుపులు మెరిపించిన శివమ్ దూబే 30 బంతుల్లోనే నాలుగు భారీ సిక్సర్లు, మరో మూడు ఫోర్లతో 54 పరుగులు చేశాడు. శివమ్ అంతర్జాతీయ టి20 కెరీర్‌లో ఇదే తొలి అర్ధ సెంచరీ కావడం విశేషం. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లి రెండు ఫోర్లతో 19 పరుగులు చేసి ఔటయ్యాడు.

కాగా, వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా రిషబ్ పోరాటం కొనసాగించాడు. కీలక సమయంలో విండీస్ బౌలర్లు పుంజుకున్నారు. ఒకవైపు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేయడమే కాకుండా అడపాదడపా వికెట్లు తీస్తూ ముందుకు సాగారు. ఇలాంటి క్లిష్ట సమయంలో రిషబ్ పంత్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న రిషబ్ ఒక సిక్స్, మరో మూడు ఫోర్లతో 22 బంతుల్లోనే 33 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో భారత్ స్కోరు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 170 పరుగులకు చేరింది.

 

Windies was a solid success in the second T20

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post విండీస్ విజయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: