అనవసరంగా ఆందోళన పడొద్దు

  ప్రయాణం అనగానే బోలెడంత ఉత్సాహం ఆనందం కలుగుతుంది. ఇలాంటి సంతోషాన్ని చక్కని జ్ఞాపకంగా ఉంచుకోవాలనుకుంటారు. ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లలో ప్రణాళిక ఉంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగుతుంది. లేదంటే ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రయాణాన్ని అనుకోని ఆటంకాలు కలగడం సహజం. అలాంటప్పుడు ఒక్కసారికి ఒత్తిడికి గురికావద్దు. మరి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ప్రయాణాలు చేసేవాళ్లకి తప్పనిసరిగా ఓపిక ఉండాలి. ప్రతిదానికీ ఆందోళన పడకూడదు. ఏదైనా టూర్‌కు వెళ్లేముందు ముందుగానే ఏమేం […] The post అనవసరంగా ఆందోళన పడొద్దు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రయాణం అనగానే బోలెడంత ఉత్సాహం ఆనందం కలుగుతుంది. ఇలాంటి సంతోషాన్ని చక్కని జ్ఞాపకంగా ఉంచుకోవాలనుకుంటారు. ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లలో ప్రణాళిక ఉంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగుతుంది. లేదంటే ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రయాణాన్ని అనుకోని ఆటంకాలు కలగడం సహజం. అలాంటప్పుడు ఒక్కసారికి ఒత్తిడికి గురికావద్దు. మరి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ప్రయాణాలు చేసేవాళ్లకి తప్పనిసరిగా ఓపిక ఉండాలి. ప్రతిదానికీ ఆందోళన పడకూడదు. ఏదైనా టూర్‌కు వెళ్లేముందు ముందుగానే ఏమేం తీసుకెళ్లాలో వస్తువుల జాబితాను ఓ పేపర్‌పై రాసిపెట్టుకోవాలి. దాని ప్రకారం సర్దుకోవాలి. ఎలక్ట్రానిక్ వస్తువులు, మందులు, టూత్ బ్రష్, పేస్ట్, అదనంగా ఒక జత లోదుస్తులను సర్దుకోవాలి. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది. సమయం ఆదా అవుతుంది.

కెమెరా బ్యాటరీలను మూడు జతలు అదనంగా తీసుకువెళ్లండి. దీనివల్ల మధ్యలో బ్యాటరీలు డెడ్ అయినా ఇబ్బంది పడకుండా ఫోటోలు తీసుకోవచ్చు. పాస్‌పోర్ట్, విమానం టిక్కెట్స్‌లాంటి ముఖ్యమైన కాగితాల జిరాక్స్ కాపీలను విడిగా ఉంచుకోండి. ఒరిజినల్స్ పోయినా సమస్య లేకుండా ప్రయాణం చేయొచ్చు. వెళ్లే చోట బీచ్ ఉంటే కనుక ఒక స్విమ్‌సూట్‌ను బ్యాగ్‌లో సర్దుకోవాలి. ముందుగానే వెళ్లాల్సిన దారి, ప్రయాణ ఛార్జీల గురించి తెలుసుకోవాలి. ప్లాన్ చేసుకోవటం సులభమవుతుంది. టూర్‌కు వెళ్లే ప్రాంతంలోని స్థానిక భాషలో ‘ప్లీజ్’, ‘థాంక్యూ’, ‘ఐయాం సారీ’ లాంటి మాటలు నేర్చుకుంటే మంచిది. మీతో వాళ్లకు పరిచయం లేకపోయినా వాళ్ల భాషలో పలకరిస్తే సంతోషపడతారు. అవసరం వస్తే ఆదుకుంటారు కూడా.

Travel safety tips

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అనవసరంగా ఆందోళన పడొద్దు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: