నవంబర్‌లో మారుతి ఉత్పత్తి 4 శాతం పెరిగింది

  న్యూఢిల్లీ: తక్కువ స్థాయిలో డిమాండ్ ఉన్నప్పటికీ తొమ్మిది నెలల క్షీణత తర్వాత నవంబరులో మారుతి సుజుకీ ఉత్పత్తి 4.33 శాతం పెరిగింది. కంపెనీ నవంబర్‌లో 1,41,834 వాహనాలను ఉత్పత్తి చేయగా, ఏడాది క్రితం ఇదే నెలలో 1,35,946 యూనిట్లు ఉత్పత్తి చేసినట్టు కంపెనీ తెలిపింది. స్టాక్‌మార్కెట్‌కు ఈమేరకు సంస్థ సమాచారమిచ్చింది. ప్రయాణీకుల వాహనాల ఉత్పత్తి కూడా 3.67 శాతం పెరిగింది. 2019 నవంబర్‌లో కంపెనీ 1,39,084 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను ఉత్పత్తి చేయగా, 2018 నవంబర్‌లో […] The post నవంబర్‌లో మారుతి ఉత్పత్తి 4 శాతం పెరిగింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: తక్కువ స్థాయిలో డిమాండ్ ఉన్నప్పటికీ తొమ్మిది నెలల క్షీణత తర్వాత నవంబరులో మారుతి సుజుకీ ఉత్పత్తి 4.33 శాతం పెరిగింది. కంపెనీ నవంబర్‌లో 1,41,834 వాహనాలను ఉత్పత్తి చేయగా, ఏడాది క్రితం ఇదే నెలలో 1,35,946 యూనిట్లు ఉత్పత్తి చేసినట్టు కంపెనీ తెలిపింది. స్టాక్‌మార్కెట్‌కు ఈమేరకు సంస్థ సమాచారమిచ్చింది. ప్రయాణీకుల వాహనాల ఉత్పత్తి కూడా 3.67 శాతం పెరిగింది.

2019 నవంబర్‌లో కంపెనీ 1,39,084 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను ఉత్పత్తి చేయగా, 2018 నవంబర్‌లో 1,34,149 యూనిట్లను ఉత్పత్తి చేసింది. ఇదే కాకుండా కాంపాక్ట్ విభాగంలో కూడా ఉత్పత్తి పెరిగింది. ఆల్టో, న్యూ వాగన్‌ఆర్, సెలెరియో, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్ మొత్తం ఉత్పత్తి 1,02,185 యూనిట్లు కాగా, ఏడాది క్రితం ఇదే నెలలో 95,883 యూనిట్లు. విటారా బ్రెజ్జా, ఎర్టిగా, ఎస్-క్రాస్ వంటి యుటిలిటీ వాహనాల ఉత్పత్తి అదే నెలలో 18 శాతం పెరిగి 27,187 యూనిట్లకు చేరుకుంది. అంతకుముందు ఏడాది ఇదే నెలలో 23,038 యూనిట్లుగా ఉంది.

అక్టోబర్‌లో ఉత్పత్తి 20 శాతం తగ్గింది
మీడియం సైజ్ కార్ సియాజ్ ఉత్పత్తి నవంబర్‌లో 1,830 యూనిట్లకు చేరుకుంది. ఏడాది క్రితం ఇదే నెలలో 1,460 యూనిట్లు. అక్టోబర్‌లో మారుతి ఉత్పత్తిని 20.7 శాతం తగ్గించింది. ఈ నెలలో కంపెనీ ఉత్పత్తి 1,19,337 యూనిట్లు. అదేవిధంగా కంపెనీ ఉత్పత్తి సెప్టెంబరులో 1,32,199 యూనిట్లతో 17.48 శాతం కోత ఉంది.

Maruti raises production by 4% in November

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నవంబర్‌లో మారుతి ఉత్పత్తి 4 శాతం పెరిగింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: