బాక్స్‌తో రండి లక్కీ లాటరీ పొందండి

  కుత్బుల్లాపూర్‌లో టిఫిన్ బాక్సుల లక్కీలాటరీకి విశేష స్పందన చికెన్ సెంటర్లలో లక్కీలాటరీ ఏర్పాటు చేసి అందరికి ఆసక్తి కనబరుస్తున్న కోలారవీందర్ కుత్బుల్లాపూర్ : మా షాపుకు టిఫిన్ బాక్స్‌తో రండి లక్కీ లాటరీ.. పొందండి అంటూ ప్లాస్టిక్ కవర్ల నిషేందంపై వినూత్న రీతిలో ప్రచారం కలిగిస్తున్న ఓ పర్యావరణ ప్రేమికుడు తనదైన శైలిలో అందరిలో ఆసక్తి కనబరుస్తున్నాడు. కూరగాయాల వ్యపారస్తులు చికెన్ సెంటర్ల నిర్వాహకులతో తన ఆలోచనను పంచుకున్న పర్యావరణ ప్రేమికుడు కోలా రవిందర్ తమ […] The post బాక్స్‌తో రండి లక్కీ లాటరీ పొందండి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కుత్బుల్లాపూర్‌లో టిఫిన్ బాక్సుల
లక్కీలాటరీకి విశేష స్పందన
చికెన్ సెంటర్లలో లక్కీలాటరీ ఏర్పాటు చేసి
అందరికి ఆసక్తి కనబరుస్తున్న కోలారవీందర్

కుత్బుల్లాపూర్ : మా షాపుకు టిఫిన్ బాక్స్‌తో రండి లక్కీ లాటరీ.. పొందండి అంటూ ప్లాస్టిక్ కవర్ల నిషేందంపై వినూత్న రీతిలో ప్రచారం కలిగిస్తున్న ఓ పర్యావరణ ప్రేమికుడు తనదైన శైలిలో అందరిలో ఆసక్తి కనబరుస్తున్నాడు. కూరగాయాల వ్యపారస్తులు చికెన్ సెంటర్ల నిర్వాహకులతో తన ఆలోచనను పంచుకున్న పర్యావరణ ప్రేమికుడు కోలా రవిందర్ తమ షాపుల్లో టిఫిన్ బాక్సులు తెచ్చిన వారికే విక్రయాలు చేపట్టాలని కోరారు. టిఫిన్ బాక్కులు తెచ్చుకున్న వ్యాపారుల ఫోన్ నంబర్లను డాబ్బాలో వేస్తున్న వ్యాపరస్తులు లాటరీ తీసి బహుమతులు అందజేస్తు ప్లాస్టిక్ కవర్ల నిషేదానికి నడుంబిగించారు.

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్లాస్టిక్ కవర్ల నిషేదంపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు నియోజకవర్గానికే వన్నె తెచ్చేలా పర్యావరణ ప్రేమికుడు, సామాజిక కార్యాకర్త కోలా రవీందర్ వినూత్న ప్రచారానికి నడుంబిగించాడు. చికెన్ సెంటర్ల వద్ద నిత్యం ప్లాస్టిక్ కవర్లలో మాంసాన్ని కొనుగోలు చేస్తున్న కస్టమర్లను చూసి చలించిపోయిన రవీందర్ ప్రజలు తమ ప్రాణాలన ప్లాస్టిక్‌మయం చేస్తున్నారని ఆవేదనతో రగిలిపోయాడు. ఎలాగైన ప్రజల్లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలనే దృడ సంకల్పంతో ముందుకు సాగిన కోలారవీందర్ పలు చికెన్ సెంటర్ల వ్యాపారులతో సమావేశం అయ్యారు. తమ దుకాణాల వద్ద టిఫిన్ బాక్సుల లాటరీ తానే ఏర్పాటు చేస్తానని తనకు సహకరించాలని వారితో తన ఆలోచనను పంచుకున్నాడు. దీంతో పలువురు అంగీకరించడంతో దుకాణాల టీఫిన్ బాక్కుల లక్కీ లాటరీ ఏర్పాటు చేశాడు.

మా దుకాణంలో టీఫిన్ బాక్సుతో వచ్చి
మాంసం కొంటే ల్యాటరీ ద్వారా బహుమతి ఫ్రీ
కోలా రవీందర్ ఆలోచనను అమలు చేసిన పలువురు చికెన్ సెంటర్ల నిర్వాహకులు సూరారం కాలనీ, సూరారం రోడ్డు తదితర ప్రాంతాల దుకాణదారులు తమ షాపూలో పూర్తిగా ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేదంలో ఉంచి పక్కాగా అమలు చేస్తున్నారు. అంతేకాకుండా తమ దు కాణంలో టిఫిన్ బాక్స్‌తో వచ్చి మాంసం కొంటే వారి ఫోన్‌నెంబర్‌ను డబ్బాలో వేసి నెలలో ఒకేసారి లాటరీ తీస్తాం అని బహుమతులు అందజేస్తామని బోర్బు ఏర్పాటు చేశారు. దీంతో ఆయా షాపులకు వచ్చే కస్టమర్లు ఇంటికి వెళ్లి టిఫిన్ బాక్సును తెచ్చుకుని మరీ మాంసం తీసుకువెలుతున్నారని దుకణదారులు తెలియజేశారు.

టిఫిన్ బాక్సులు తెచ్చి ల్యాటరీలో గెలిచిన
కస్టమర్లకు అందజేస్తున్న బహుమతులు ఇవే..
టిఫిన్ బాక్సులను దుకాణాలకు తెచ్చి మాంసం కొనుగోలు చేసిన వారికి ఫోన్ నెంబర్లను డబ్బాలో వేసి లాటరీ తీసి విజేతలకు బహుమతులను అందజేసే ఆలోచనతో అందరి మన్నలను పొందుతున్న రవీందర్ బహుమతులను తనకు తోచిన స్థాయిలో ఏర్పాటు చేశారు. సొంతడబ్బులతో లాటరీ విజేతలకు బహుమతులు అందజేస్తున్నట్లు రవీందర్ వెల్లడించారు. లాటరీలో 1వ బహుమతిగా మటన్, 2వ బహుమతిగా 1కేజీ చికెన్, 3వ బహుమతిగా కేజీ బోటి, 4వ బహుమతిగా 4 మేక కాలు ఏర్పాటు చేసి బహుమతులను సైతం మాంసపు ప్రియులను ఆకట్టుకునేలా ఏర్పాటు చేశారు.

ఈ ఆలోచనలతో కొంతమంది మారినా సంతోషమే : కోలా రవీందర్
నిత్యం ప్లాస్టిక్ కవర్లు వాడుతూ ప్రాణాలకు హాని తెచ్చుకుంటున్న ప్రజలు తన ఈ కొత్త ఆలోచన ద్వారా కొంత మంది మారినా సంతోషమే కదా అంటున్నారు. పర్యావరణ ప్రేమికుడు కోలా రవీందర్, ఎప్పటినుండో తాను ఈ తరహా ఉద్యమాలు సింగిల్‌గానే చేస్తున్నాని తెలిపిన ఆయన గతంలో తన కుమారుడి వివాహంలో సైతం ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేందించారు. నీరుతాగే గ్లాసుల వద్దనుండి అన్నం తీనే విస్తర్ల వరకు అన్ని వస్తువులు పర్యావరణాన్ని కాపాడే సామాగ్రి వాడి బందువులు, స్నేహితులు మన్ననలను పొందాడు. ఈసారి కూడా విన్నూత్న రీతిలో మాంసం దుకాణాల వద్ద ప్రజలకు అవగాహన కల్పించే విధంగా నడుంబిగించిన రవీందర్‌కు ప్రజలు హ్యాట్సాఫ్ తెలుపుతున్నారు.

Tiffin Boxes Lucky Lottery in Qutbulapur

The post బాక్స్‌తో రండి లక్కీ లాటరీ పొందండి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: