విద్యకు పెద్దపీట వేస్తున్న సిఎం కెసిఆర్

  సూర్యపేట: విద్యాభివృధ్ధికి ముఖ్యమంత్రి కెసిఆర్ అధిక నిధులు కేటాయిస్తూ పెద్దపీట వేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని జలాల్‌పురం ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన 60 వసంతాల వజ్రోత్సవ వేడుకలకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎంఎల్‌ఎ గొంగిడి సునీత మహెందర్‌ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మెన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డితో కలిసి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె పూర్వ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలో విద్యాభివృధ్ధికి […] The post విద్యకు పెద్దపీట వేస్తున్న సిఎం కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సూర్యపేట: విద్యాభివృధ్ధికి ముఖ్యమంత్రి కెసిఆర్ అధిక నిధులు కేటాయిస్తూ పెద్దపీట వేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని జలాల్‌పురం ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన 60 వసంతాల వజ్రోత్సవ వేడుకలకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎంఎల్‌ఎ గొంగిడి సునీత మహెందర్‌ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మెన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డితో కలిసి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె పూర్వ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలో విద్యాభివృధ్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు పూర్వ విద్యార్థులు సహకారం, కృషి ఎంతో అవసరమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు అలుగుబెల్లి నర్సిరెడ్డి, కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్యరెడ్డి, ఎంపిపి చిమ్ముల సుధీర్‌రెడ్డి, స్థానిక సర్పంచు సంగిశెట్టి వెంకటేష్, ఎంపిటిసి సభ్యులు నరసింహతో పాటు పూర్వ విద్యార్థి సంఘం నాయకులు మాదిరెడ్డి మల్లారెడ్డి, మంగారెడ్డి, విజయేందర్‌రెడ్డి, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Sabitha Reddy attended the 60th Vajrotsavam celebrations

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post విద్యకు పెద్దపీట వేస్తున్న సిఎం కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: