మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం : ఇద్దరి అరెస్టు

  అహ్మదాబాద్ : వడోదర లోని 14 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేశారన్న ఆరోపణపై అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచి ఆదివారం ఇద్దరిని అరెస్టు చేసింది. నిందితులు కిషన్ మధసూరియా(28), జసో సొలాంకీ (21)లని గుర్తించారు. వడోదర లోని తారసలి ఏరియాలో వీరి నివాస స్థలాల వద్ద అరెస్టు చేసినట్టు పోలీస్ స్పెషల్ కమిషనర్ అజయ్‌తోమర్ చెప్పారు. వడోదర రాజ్‌మహల్ రోడ్డులో నవలఖి కాంపౌండ్ ఏరియాల్లో నవంబర్ 28 రాత్రి బాధితురాలు తన స్నేహితునితో వెళ్తుండగా […] The post మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం : ఇద్దరి అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అహ్మదాబాద్ : వడోదర లోని 14 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేశారన్న ఆరోపణపై అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచి ఆదివారం ఇద్దరిని అరెస్టు చేసింది. నిందితులు కిషన్ మధసూరియా(28), జసో సొలాంకీ (21)లని గుర్తించారు. వడోదర లోని తారసలి ఏరియాలో వీరి నివాస స్థలాల వద్ద అరెస్టు చేసినట్టు పోలీస్ స్పెషల్ కమిషనర్ అజయ్‌తోమర్ చెప్పారు. వడోదర రాజ్‌మహల్ రోడ్డులో నవలఖి కాంపౌండ్ ఏరియాల్లో నవంబర్ 28 రాత్రి బాధితురాలు తన స్నేహితునితో వెళ్తుండగా ఈ అత్యాచారం జరిగింది.

నిందితులు ఆ స్నేహితుడిని లాగి వేసి బాధితురాలిని కాంపౌండ్ లోని ఒంటరి ప్రదేశానికి ఈడ్చుకుని వెళ్లి అత్యాచారానికి పాల్పడి తప్పించుకున్నారు. నిందితుల ఆచూకీ తెలిపితే లక్ష రూపాయలు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించినప్పటికీ వారి స్కెచ్‌లు బయటకు విడుదల చేశారు. నిందితుడు మధసూరియా ఆనంద్ లోని తారాపూర్ గ్రామానికి చెందిన వాడు కాగా, మరో నిందితుడు సోలాంకి రాజ్‌కోట్ లోని జస్‌దన్‌కు చెందిన వాడు. నిందితులు గతంలో దోపిడీలు, దొంగతనాలు, దౌర్జన్యాలకు పాల్పడే వారని సమాచారం తెలిసింది. మిగతా నేరాలతో కూడా వీరికి సంబంధం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Two arrest in Vadodara minor rape case at ahmedabad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం : ఇద్దరి అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.