‘అర్జున్‌ సురవరం’ పైరసీ సిడిలు.. షాక్ లో నిఖిల్

  ‘అర్జున్‌ సురవరం’ చిత్రం హిట్ తో హీరో నిఖిల్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ సినిమా సక్సెస్ టూర్ లో భాగంగా గుంటూరు వెళ్లివస్తోన్న నిఖిల్‌కు ఊహించని షాక్ తగిలింది. మధ్యలో రిఫ్రెష్‌మెంట్ కోసం ఓ ఛాయ్ దుకాణం వద్ద కారు ఆపాడు. టీ తాగుతున్న సమయంలో పక్కనే సిడిలు అమ్ముతోన్న బండివైపు నిఖిల్ దృష్టి పడింది. అక్కడికి వెళ్లి చూసి షాక్ అయ్యాడు.  తన తాజా సినిమా ‘అర్జున్‌ సురవరం’ పైరసీ సిడిలను, రోడ్డు […] The post ‘అర్జున్‌ సురవరం’ పైరసీ సిడిలు.. షాక్ లో నిఖిల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

‘అర్జున్‌ సురవరం’ చిత్రం హిట్ తో హీరో నిఖిల్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ సినిమా సక్సెస్ టూర్ లో భాగంగా గుంటూరు వెళ్లివస్తోన్న నిఖిల్‌కు ఊహించని షాక్ తగిలింది. మధ్యలో రిఫ్రెష్‌మెంట్ కోసం ఓ ఛాయ్ దుకాణం వద్ద కారు ఆపాడు. టీ తాగుతున్న సమయంలో పక్కనే సిడిలు అమ్ముతోన్న బండివైపు నిఖిల్ దృష్టి పడింది. అక్కడికి వెళ్లి చూసి షాక్ అయ్యాడు.  తన తాజా సినిమా ‘అర్జున్‌ సురవరం’ పైరసీ సిడిలను, రోడ్డు పక్కన పల్లీలు అమ్మినట్టు అమ్మడం చూసి షాక్‌కి గురయ్యాడు.

వాటిని అమ్మే మహిళను హీరో ప్రశ్నించగా, కుటుంబం ఆర్థిక కష్టాల్లో ఉందని, పొట్టకూటి కోసం ఇలా చేస్తున్నామని చెప్పడంతో నిఖిల్‌కు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. వాటిని తీసుకెళ్లి కారులో పెట్టి క్రాస్ చెక్ చెయ్యగా, అవి ప్లే అయ్యాయి.  ఒక సిడిలో మూడు ఇటీవల రిలీజయిన సినిమాలు ఉంచి, ఒక్కో సిడి 40 రూపాయల చొప్పున అమ్మకాలు జరుపుతున్నారు.  ఇలాంటివారు ఉంటూనే ఉంటారని, దయచేసి పైరసీని ఎంకరేజ్ చెయ్యకుండా థియేటర్‌కి వెళ్లి సినిమాలు చూడాలని నిఖిల్ ప్రేక్షకులను కోరాడు. ఈ ఘటనకు సంబందించిన వీడియోను హీరో నిఖిల్ తన వ్యక్తిగత ట్విట్టర్ లో పోస్టు చేశారు.

Nikhil shock with Arjun Suravaram piracy CDs

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘అర్జున్‌ సురవరం’ పైరసీ సిడిలు.. షాక్ లో నిఖిల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: