చిరుతను చంపిన ఇంజనీరింగ్ విద్యార్థులు…తోకను కత్తితో కట్ చేసి

భువనేశ్వర్: ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు చిరుత పులిని చంపి అనంతరం దాని తోకను కత్తితో కట్ చేసిన సంఘటన అస్సాం రాష్ట్రం గౌహతి ప్రాంతంలో జలక్‌బారీలో జరిగింది. చిరుత పులిని చంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. జలక్‌బారీ ఆయుర్వేదిక్ ఆస్పత్రిలో అవరణంలోకి చిరుతపులి రాగానే కొందరు విద్యార్థులు దాని దగ్గరకు వెళ్లి వీడియో షూట్ చేశారు. దెబర్తి చుటియా(20) ఇంజనీరింగ్ విద్యార్థి చిరుత పులి దగ్గరకు వెళ్లి […] The post చిరుతను చంపిన ఇంజనీరింగ్ విద్యార్థులు… తోకను కత్తితో కట్ చేసి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.


భువనేశ్వర్: ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు చిరుత పులిని చంపి అనంతరం దాని తోకను కత్తితో కట్ చేసిన సంఘటన అస్సాం రాష్ట్రం గౌహతి ప్రాంతంలో జలక్‌బారీలో జరిగింది. చిరుత పులిని చంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. జలక్‌బారీ ఆయుర్వేదిక్ ఆస్పత్రిలో అవరణంలోకి చిరుతపులి రాగానే కొందరు విద్యార్థులు దాని దగ్గరకు వెళ్లి వీడియో షూట్ చేశారు. దెబర్తి చుటియా(20) ఇంజనీరింగ్ విద్యార్థి చిరుత పులి దగ్గరకు వెళ్లి వీడియో తీస్తుండగా అతడిపై దాడి చేసింది. స్థానికులు చిరుత నుంచి ఆ విద్యార్థిని కాపాడారు. కొంత మంది విద్యార్థులు కత్తుల, కట్టేలతో చిరుతపై దాడి చేశారని ఎంటెక్ విద్యార్థి బర్నాలీ తలక్దర్ తెలిపాడు. విద్యార్థుల దాడిలో తీవ్రంగా గాయపడిన చిరుత చనిపోయింది. చిరుత తోకను కత్తితో కట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేసి విద్యార్థులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చిరుత కాలేజీ అవరణంలోకి వచ్చింది నిజమే కానీ ఎవరిపై దాడి చేయలేదని, విద్యార్థులు దాని దగ్గరికి వెళ్లి వీడియో తీయడంతో చిరుత దాడి చేసిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. అటవీ జంతువులు జనవాసాల్లోకి వచ్చినప్పుడు పోలీసులకు, అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు. చిరుత దాడిలో గాయపడిన విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

courtesy by Prag news

 

 

The post చిరుతను చంపిన ఇంజనీరింగ్ విద్యార్థులు… తోకను కత్తితో కట్ చేసి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: