‘వెంకీమామ‌’ట్రైలర్.. మామా అల్లుళ్ల వినోదం చూడాల్సిందే

  విక్టరీ వెంక‌టేష్‌, యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కిన మల్టీస్టారర్ చిత్రం ‘వెంకీమామ‌’. రియల్ లైఫ్ లో మామా అల్లుళ్లు అయిన వెంకీ, చైతూలు ఈ చిత్రంలోనూ అవే పాత్రల్లో నటిస్తుండగా.. వీరికి జోడీగా రాశీ ఖన్నా, పాయల్ రాజ్ పుత్ కథానాయికలుగా నటిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి ఖమ్మంలో జరిగింది. ఈ కార్యక్రమంలో నాగ చైతన్య, వెంకటేష్ లతోపాటు హీరోయిన్లు రాశీ ఖ‌న్నా, […] The post ‘వెంకీమామ‌’ ట్రైలర్.. మామా అల్లుళ్ల వినోదం చూడాల్సిందే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

విక్టరీ వెంక‌టేష్‌, యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కిన మల్టీస్టారర్ చిత్రం ‘వెంకీమామ‌’. రియల్ లైఫ్ లో మామా అల్లుళ్లు అయిన వెంకీ, చైతూలు ఈ చిత్రంలోనూ అవే పాత్రల్లో నటిస్తుండగా.. వీరికి జోడీగా రాశీ ఖన్నా, పాయల్ రాజ్ పుత్ కథానాయికలుగా నటిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి ఖమ్మంలో జరిగింది. ఈ కార్యక్రమంలో నాగ చైతన్య, వెంకటేష్ లతోపాటు హీరోయిన్లు రాశీ ఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్‌లు సంద‌డి చేశారు.

ఈ సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్ ని చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ లో వినోదం, ఎమోషన్స్ తోపాటు యాక్షన్ ను చూపించారు. ఈ ట్రైలర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో యూట్యూబ్ ట్రెండింగ్ లో ఈ ట్రైలర్ నిలిచింది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కు విశేష స్పందన లభించింది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక, సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ నెల 13న మూవీని ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.

Venky Mama Trailer released

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘వెంకీమామ‌’ ట్రైలర్.. మామా అల్లుళ్ల వినోదం చూడాల్సిందే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: