టీ తర్వాతే పని.. వైరల్ మీడియా

  ఓ గుర్రం పొద్దున్నే వేడి వేడి టీ తాగుతోంది. అదేంటి గుర్రం గుగ్గిళ్లు తింటుంది గానీ టీ తాగుతుందా.. అనిపిస్తుంది కదూ! అదే మరి ఆ గుర్రం స్పెషాలిటీ. ఇలా ఒకటీ రెండు సార్లు కాదు 15 సంవత్సరాల నుంచి తాగుతుంది ఆ పోలీసు గుర్రం. పొద్దున్నే ఏదన్నా పని మొదలు పెట్టాలంటే ఫ్రెష్‌గా టీ తాగాల్సిందే. వేడివేడి టీ కోసం తహతహలాడిపోయే ఆ గుర్రం పేరు జాక్. జాక్ 15 ఏళ్లుగా ఇంగ్లాండ్‌లోని మెర్సిసైడ్ […] The post టీ తర్వాతే పని.. వైరల్ మీడియా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఓ గుర్రం పొద్దున్నే వేడి వేడి టీ తాగుతోంది. అదేంటి గుర్రం గుగ్గిళ్లు తింటుంది గానీ టీ తాగుతుందా.. అనిపిస్తుంది కదూ! అదే మరి ఆ గుర్రం స్పెషాలిటీ. ఇలా ఒకటీ రెండు సార్లు కాదు 15 సంవత్సరాల నుంచి తాగుతుంది ఆ పోలీసు గుర్రం. పొద్దున్నే ఏదన్నా పని మొదలు పెట్టాలంటే ఫ్రెష్‌గా టీ తాగాల్సిందే. వేడివేడి టీ కోసం తహతహలాడిపోయే ఆ గుర్రం పేరు జాక్. జాక్ 15 ఏళ్లుగా ఇంగ్లాండ్‌లోని మెర్సిసైడ్ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తోంది. రోజూ అది డ్యూటీకి వెళ్లే ముందు ఒక కప్పు టీ తాగాకే ముందుకు కదులుతుంది. టీ ఇవ్వకుంటే జాక్ అడుగు కూడా ముందుకు వేయదట. ఈ 20 ఏళ్ల జాక్‌కు గోరు వెచ్చటి పాలతో రెండు టీస్పూన్లు షుగర్ కలిపి… దాంట్లో కూల్ వాటర్ కలిపి టీ ఇస్తే జాక్ చక్కగా లొట్టలు వేసుకుంటూ తాగేస్తుంది. జాక్‌కు టీ అలవాటు ఎలా అయిందంటే తన రైడర్ తాగిన టీ కప్పులో కొద్దిగా టీ మిగిలుంటే తాగేసింది.

మరి దానికి ఆ టేస్ట్ నచ్చిందో ఏమో.. ఇక అప్పటి నుంచీ ఎవరైనా టీ తాగి కప్పు పక్కన పెట్టగానే మిగిలిన టీ తాగేస్తోంది. అది సిబ్బంది గమనించి ఓ టీ కప్పు జాక్ ముందు పెడితే చక్కగా తాగేస్తోంది. దీంతో ప్రతి రోజూ తమతోపాటూ… ఓ కప్పు టీ ఆ గుర్రానికి ఇస్తున్నారు. సాధారణంగా మనుషులు తాగే రెగ్యులర్ కప్పుల కంటే కాస్త పెద్ద కప్పును కేటాయించారు. టీ తాగిన తర్వాత ఫుల్ ఎనర్జీతో ఈ గుర్రం పరుగులు పెడుతోంది. జాక్‌తో కలిపి… ప్రస్తుతం అక్కడ 12 గుర్రాలున్నాయి. మిగతావి టీ తాగవు. రోజూ జాక్‌కి టెట్లీయక్ టీ ఇస్తున్నట్లు ట్విట్టర్‌లో వీడియో ట్వీట్ ద్వారా పోలీసులు తెలిపారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయింది.

Horse drinking tea every morning viral vedio

The post టీ తర్వాతే పని.. వైరల్ మీడియా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: