అత్యాచారాల రాజధానిగా భారత్

కాంగ్రెస్ నేత రాహుల్ వ్యాఖ్య వయనాడ్ : దేశంలో పెరుగుతున్న అత్యాచార సంఘటనలను దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ సమాజం మన దేశం తీరుపై అపహాస్యం చేస్తోందని, ప్రపంచం మొత్తం మీద భారత్ ఇప్పుడు అత్యాచార రాజధానిగా పిలవబడుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. వయనాడ్ లోక్‌సభ నియోజక వర్గంలో తన మూడు రోజుల పర్యటన ముగించిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీని ఆయన రాజకీయ జీవితం అంతా ద్వేషం, విభజన, హింసలపైనే ఆధారపడిందని తీవ్రంగా విమర్శించారు. ప్రతిరోజూ […] The post అత్యాచారాల రాజధానిగా భారత్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
కాంగ్రెస్ నేత రాహుల్ వ్యాఖ్య

వయనాడ్ : దేశంలో పెరుగుతున్న అత్యాచార సంఘటనలను దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ సమాజం మన దేశం తీరుపై అపహాస్యం చేస్తోందని, ప్రపంచం మొత్తం మీద భారత్ ఇప్పుడు అత్యాచార రాజధానిగా పిలవబడుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. వయనాడ్ లోక్‌సభ నియోజక వర్గంలో తన మూడు రోజుల పర్యటన ముగించిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీని ఆయన రాజకీయ జీవితం అంతా ద్వేషం, విభజన, హింసలపైనే ఆధారపడిందని తీవ్రంగా విమర్శించారు. ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట ఓ బాలిక అత్యాచారానికి గురి కావడమో లేక హత్యకు గురికావడమో జరుగుతోందని ఈ సమాచారం పత్రికల్లో చదివి బాలికలు, చెల్లెళ్లు, తల్లులు దిగ్భ్రాంతికి గురవుతున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు.

ఉత్తర ప్రదేశ్ బిజెపి ఎమ్‌ఎల్‌ఎ కులదీప్‌సింఘ్ సింగార్ అత్యాచార కేసును ఉదహరిస్తూ బాధితురాలి కారును ట్రక్కు ఢీకొన్నప్పుడు ప్రధాని స్పందించ లేదని విమర్శించారు. ఆ ఎమ్‌ఎల్‌ఎ అత్యాచారంలో నిందితుడైనా ప్రధాని ఒక మాట అనకపోవడం విడ్డూరమని అన్నారు. మన ప్రజలు భయంతో అసౌకర్యంతో బతుకుతున్నారని, దేశ గతిని మార్చగలిగే ప్రజల శక్తిని తక్కువ అంచనా వేయవద్దని మోడీపై పరోక్షంగా వ్యాఖ్యానించారు. మైనార్టీ వర్గాలపైన, దళితుల పైన కూడా హింస పెరుగుతోందని, దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడే శక్తి ఈ విధంగా చాలా బలహీనంగా తయారైందని విమర్శించారు. దేశాన్ని ముందుకు తీసుకుపోయే ఆలోచన మోడీకి లేదన్నారు. మూడు రోజుల పర్యటనలో రాహుల్ గాంధీ అనేక ప్రదేశాలను సందర్శించారు. గత నెల పాముకాటుకు మృతి చెందిన షెహలా షెరీన్ ఇంటికి కూడా వెళ్లారు.

India is known as the rape capital of the world

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అత్యాచారాల రాజధానిగా భారత్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: