కుళ్లిన దశకు మృతదేహాలు

కుటుంబాలకు అప్పగించేలా ఆదేశాలివ్వండి శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంది హైకోర్టును ఆశ్రయించిన మహబూబ్‌నగర్ ఎస్‌పి మన తెలంగాణ/హైదరాబాద్,షాద్‌నగర్: ‘దిశ’ హత్యకేసు నిందితుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మహబూబ్‌నగర్ జిల్లా ఎస్‌పి రెమె రాజేశ్వరి శనివారం నాడు హైకోర్టును ఆశ్రయించారు. మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలను భద్రపరిచే వసతులు లేవని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇప్పటికే మృతదేహాలు డీ కంపోస్ అయ్యాయని పోలీసులు వివరించారు. కుటుంబ సభ్యులు కూడా మృతదేహాలు అప్పగించాలని కోరుతున్నారని […] The post కుళ్లిన దశకు మృతదేహాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కుటుంబాలకు అప్పగించేలా ఆదేశాలివ్వండి
శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంది
హైకోర్టును ఆశ్రయించిన మహబూబ్‌నగర్ ఎస్‌పి

మన తెలంగాణ/హైదరాబాద్,షాద్‌నగర్: ‘దిశ’ హత్యకేసు నిందితుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మహబూబ్‌నగర్ జిల్లా ఎస్‌పి రెమె రాజేశ్వరి శనివారం నాడు హైకోర్టును ఆశ్రయించారు. మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలను భద్రపరిచే వసతులు లేవని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇప్పటికే మృతదేహాలు డీ కంపోస్ అయ్యాయని పోలీసులు వివరించారు. కుటుంబ సభ్యులు కూడా మృతదేహాలు అప్పగించాలని కోరుతున్నారని ఎస్‌పి ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఇక్కడి నుంచి మృతదేహాలను తరలించేలా ఆదేశాలివ్వాలని జిల్లా ఎస్‌పి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణ జరిపి హైకోర్టు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు మహబూబ్‌నగర్ పోలీసులు భావిస్తున్నారు.

ఈ క్రమంలో దిశ నిందితుల మృతదేహాల తరలింపుపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. ఈ నెల 9వ తేదీ వరకు మృతదేహాలను మహబూబ్‌నగర్ మార్చురీలోనే ఉంచే అవకాశం ఉంది. అంత్యక్రియలు నిర్వహించాలని నిందితుల కుటుంబసభ్యులు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. మృతదేహాల కోసం ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నరేశ్ కుటుంబ సభ్యులు, బంధువులు శనివారం నాడు మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆ సుపత్రికి వచ్చారు. వారికి మృతదేహాలు ఇవ్వకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు. నలుగురి మృతదేహాలకు స్వతంత్ర నిపుణులతో మళ్లీ పోస్టుమార్టం చే యించాలని కోరుతూ ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌పైనా హైకోర్టు స్పందించింది. ఈ పిటిషన్‌ను తొమ్మిదవ తేదీ ఉద యం పరిశీలిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి 8 గంటల వరకు అంత్యక్రియలు చేయరాదని కోర్టు ఆదేశించింది.

డిసిపి సురేందర్‌రెడ్డికి విచారణ బాధ్యత

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ విచారణాధికారిగా రాచకొండ అదనపు డిసిపి సురేందర్‌రెడ్డి శనివారం నా డు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈక్రమంలో చటాన్‌పల్లి వంతెన కింద జరిగిన ఎన్‌కౌంటర్‌పై ఆయన దర్యాప్తు జరుపనున్నారు.

నివేదిక ఆధారంగా వివరాలు : ప్రకాశ్‌రెడ్డి

ఎన్ కౌంటర్ ప్రదేశాన్ని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రతినిధులు పరిశీలించారని, బృందం సభ్యులు ఇచ్చే నివేధిక ఆధారంగా వివరాలు వెళ్లడిస్తామని శంషాబాద్ డిసిపి ప్రకాష్‌రెడ్డి అన్నారు. ఎన్‌హెచ్‌ఆర్‌సి ప్రతినిధులు సంఘటన స్థలాన్ని సందర్శించిన అనంతరం డిసిపి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎన్‌హెచ్‌ఆర్‌పి ప్రతినిధులు ఇచ్చే నివేదిక ఆధారంగా వివరాలు వెళ్లడిస్తామన్నారు. దిశ ఘటన, నిందితుల ఎన్‌కౌంటర్ స్థలాన్ని ఏడుగురు సభ్యులతో కూడిన జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం పరిశీలిందన్నారు. ఇదే బృందం మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రిలో మార్చురీలో ఉన్న నలుగురు నిందితుల మృతదేహాలను పరిశీలించిందని పేర్కొన్నారు.

అనంతరం నలుగురు నిందింతులు మృతి చెందిన ప్రాంతాన్ని సైతం పరిశీలించినట్లు వివరించారు. ఈక్రమంలో ఎన్‌హెచ్‌ఆర్‌సి బృందానికి సీనియర్ ఎస్‌పి నేతృత్వం వహిస్తున్నారని డిసిపి తెలిపారు. ఆ బృందంలో ఫోరెన్సిక్ నిపుణుడు కూడా ఉన్నారని ఆయన అన్ని కోణాల్లో విచారణ చేపట్టాడని తెలిపారు. ఘటనకు సంబంధించి వారు తమ దగ్గర వివరాలు మాత్రమే తీసుకున్నారని వెల్లడించారు. వారు మీడియాతో మాట్లాడే వీలు లేనందున వాళ్ల తరఫున తనను మాట్లాడమన్నారని డిసిపి మీడియాతో పేర్కొన్నారు.

Disha murder case

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కుళ్లిన దశకు మృతదేహాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: