రూల్స్ పాటించలేదు

 2014 మార్గదర్శకాలు పట్టించుకోలేదు ఎన్‌కౌంటర్‌పై ‘సుప్రీం’లో న్యాయవాదుల పిటిషన్ మనతెలంగాణ/హైదరాబాద్ : సంచలన సృష్టించిన దిశ అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై న్యాయవాదులు జిఎస్ మణి, ప్రదీప్‌కుమార్ యాదవ్‌లు శనివారం నాడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ పోలీసులు నిందితులపై జరిపిన ఎన్‌కౌంటర్‌లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని, ఘటనపై వెంటనే విచారణకు ఆదేశించాలని న్యాయవాదులు మణి, ప్రదీమ్‌కుమార్‌లు దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్ జరిపిన పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్ విషయంలో 2014లో అత్యున్నత […] The post రూల్స్ పాటించలేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 2014 మార్గదర్శకాలు పట్టించుకోలేదు
ఎన్‌కౌంటర్‌పై ‘సుప్రీం’లో న్యాయవాదుల పిటిషన్

మనతెలంగాణ/హైదరాబాద్ : సంచలన సృష్టించిన దిశ అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై న్యాయవాదులు జిఎస్ మణి, ప్రదీప్‌కుమార్ యాదవ్‌లు శనివారం నాడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ పోలీసులు నిందితులపై జరిపిన ఎన్‌కౌంటర్‌లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని, ఘటనపై వెంటనే విచారణకు ఆదేశించాలని న్యాయవాదులు మణి, ప్రదీమ్‌కుమార్‌లు దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్ జరిపిన పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్ విషయంలో 2014లో అత్యున్నత న్యాయస్థానం రూపొందించిన మార్గదర్శకాలను పోలీసులు విస్మరించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

కాగా ఎన్‌కౌంటర్‌ఉదంతానికి సంబంధించి శుక్రవారం షాద్‌నగర్ పోలీసులు ఇదివరకే కేసు నమోదు చేశారు. దిశ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న షాద్‌నగర్ ఎసిపి వి.సురేంద్ర ఫిర్యాదు మేరకు హత్యాయత్నం (ఐపిసి సెక్షన్307) కింద కేసు నమోదు చేశారు. ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సి సభ్యులు కూడా విచారణ ప్రారంభించారు. మరోవైపు తెలంగాణ పోలీసులు దిశ నిందితులపై జరిపిన ఎన్‌కౌంటర్ బాధిత కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చట్ట ప్రకారం శిక్షించకుండా అన్యాయంగా కాల్చిచంపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎన్‌కౌంటర్ జరిగిన అనంతరం ప్రక్రియలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సుప్రీంకోర్టు గతంలో అభిప్రాయపడింది. దీని కొరకు ఐదేళ్ల కిందట పలు మార్గదర్శకాలను రూపిందించింది. వీటిని తప్పక పాటించాలని ఆదేశాలు జారీచేసింది.

‘సుప్రీం’మార్గదర్శకాలు

 ఘటనాస్థలంలో నిందితులు సంచరిస్తున్న సమాచారాన్ని రికార్డు చేయాలి.
ఎన్‌కౌంటర్ మరణాలకు తప్పనిసరిగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి.
ఎన్‌కౌంటర్ కేసునూ వివరాలను కోర్టుకు పంపించాలి.
పోలీసు దర్యాప్తునకు సమాంతరంగా సిఐడి దర్యాప్తు సాగాలి
మృతుల పోస్ట్‌మార్టం ప్రక్రియను వీడియో తీయాలి
ఘటనపై బాధిత కుటుంబాలకు వెంటనే సమాచారం ఇవ్వాలి
ఘటనపై మెజిస్టీరియల్ దర్యాప్తు జరపాలి.
ఎన్‌కౌంటర్ సమాచారాన్ని ఎన్‌హెచ్‌ఆర్‌సికి చేరవేయాలి
ఎఫ్‌ఐఆర్‌ను డైరీ ఎంట్రీలను, పంచనామాలను వెంటనే కోర్టుకు సమర్పించాలి.
ఘటనపై వేగంగా అభియోగపత్రం నమోదు చేయాలి.
ఇతర సమాచారాన్ని సైతం సాధ్యమైనంత త్వరగా కోర్టుకు అందించాలి
ఎన్‌కౌంటర్‌లపై ఆరునెలలకు ఒకసారి ఎన్‌హెచ్‌ఆర్‌సి నివేదిక పంపాలి.
పోలీసుల తప్పుంటే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి.
మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలి
ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులకు వెంటనే అవార్డులు ఇవ్వరాదు
ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు నివృత్తి అయ్యాకే అవార్డులకు పరిశీలించాలి.
ఎన్‌కౌంటర్ ఉపయోగించిన ఆయుధాలను పైస్థాయి అధికారుల వద్ద సరెండర్ చేయాలి

Lawyers File Petition In SC Against Hyderabad Encounter

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రూల్స్ పాటించలేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.