ఎయిర్‌టెల్ యాప్‌లో భారీ భద్రతా లోపం

సకాలంలో సరిచేసిన కంపెనీ న్యూఢిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌కు చెందిన మొబైల్ యాప్‌లో తీవ్రమైన భద్రతా లోపం తలెత్తింది. అయితే సరయిన సమయంలో దీన్ని గుర్తించి సరి చేయడంతో పెద్ద సంఖ్యలో యూజర్ డేటా లీక్ ప్రమాదం తప్పినట్లు ఎయిర్‌టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్‌టెల్ యాప్‌లోని అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్(ఒపిఐ)లో ఈ భద్రతా లోపం తలెత్తినట్లు కంపెనీ తెలిపింది. ఈ లోపం కారణంగా హ్యాకర్లు కేవలం యూజర్ల ఫోన్ నంబర్ల ద్వారానే వారి వ్యక్తిగత […] The post ఎయిర్‌టెల్ యాప్‌లో భారీ భద్రతా లోపం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
సకాలంలో సరిచేసిన కంపెనీ

న్యూఢిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌కు చెందిన మొబైల్ యాప్‌లో తీవ్రమైన భద్రతా లోపం తలెత్తింది. అయితే సరయిన సమయంలో దీన్ని గుర్తించి సరి చేయడంతో పెద్ద సంఖ్యలో యూజర్ డేటా లీక్ ప్రమాదం తప్పినట్లు ఎయిర్‌టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్‌టెల్ యాప్‌లోని అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్(ఒపిఐ)లో ఈ భద్రతా లోపం తలెత్తినట్లు కంపెనీ తెలిపింది. ఈ లోపం కారణంగా హ్యాకర్లు కేవలం యూజర్ల ఫోన్ నంబర్ల ద్వారానే వారి వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకునే ప్రమాదం ఉందని తెలిపింది. యూజర్ల పేరు, అడ్రసు, పుట్టిన తేదీ, మొబైల్ ఐఎంఇఐ నంబర్, ఇ మెయిల్ ఐడి తదితర వివరాలను హ్యాకర్లు తెలుసుకుని ఉండే వారని తెలిపింది.

అదే గనుక జరిగితే 30 కోట్ల మంది యూజర్ల వ్యక్తిగత డేటా ప్రమాదంలో పడేది. అయితే ఈ సమస్య తమ దృష్టికి వచ్చిన వెంటనే సరి చేసినట్లు ఎయిర్‌టెల్ తెలిపింది. బెంగళూరుకు చెందిన సెక్యూరిటీ రిసెర్చర్ ఇరాజ్ అహ్మద్ ఈ లోపాన్ని కనుగొని ఎయిర్‌టెల్‌కు సమాచారమిచ్చారు. దీంతో వెంటనే దాన్ని సరి చేసినట్లు ఎయిర్‌టెల్ అధికార ప్రతినిధి తెలిపారు. ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఆ ప్రతినిధి తెలిపారు.

Huge security flaw in Airtel App

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎయిర్‌టెల్ యాప్‌లో భారీ భద్రతా లోపం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: