ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తేసిన ఎయిర్‌టెల్

ఎలాంటి షరతులు ఉండవని ట్వీట్ న్యూఢిల్లీ: ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్ విషయంలో అన్‌లిమిటెడ్ ప్లాన్స్‌లో ఉన్న పరిమితిని ఎత్తివేస్తూ టెలికాం ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 3నుంచి అమలోకి తెచ్చిన పాన్స్‌లో ఈ మేరకు మార్పు చేసింది. ఎయిర్‌టెల్ ఇటీవల తన ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను గరిష్ఠంగా 50 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు కొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్లు ప్రకటించింది. 28 రోజుల […] The post ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తేసిన ఎయిర్‌టెల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
ఎలాంటి షరతులు ఉండవని ట్వీట్

న్యూఢిల్లీ: ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్ విషయంలో అన్‌లిమిటెడ్ ప్లాన్స్‌లో ఉన్న పరిమితిని ఎత్తివేస్తూ టెలికాం ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 3నుంచి అమలోకి తెచ్చిన పాన్స్‌లో ఈ మేరకు మార్పు చేసింది. ఎయిర్‌టెల్ ఇటీవల తన ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను గరిష్ఠంగా 50 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు కొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్లు ప్రకటించింది.

28 రోజుల వ్యాలిడిలీ ప్లాన్‌పై 1000 నిమిషాలు, 84 రోజుల ప్లాన్‌కు 3 వేల నిమిషాలు, 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌కు 12 వేల నిమిషాల పరిమితిని విధించింది. ఈ పరిమితికి మించి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌కు నిమిషానికి 6 పైసల చొప్పున వసూలు చేస్తామని ప్రకటించింది. అయితే శనివారం నుంచి అన్ లిమిటెడ్ ప్లాన్లు ఉపయోగించి దేశవ్యాప్తంగా ఇతర ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమితంగా మాట్లాడుకోవచ్చని, ఎలాంటి షరతులు ఉండబోవని ఎయిర్‌టెల్ ట్వీట్ చేసింది. ఎయిర్‌టెల్‌తో పాటుగా వొడాఫోన్ ఐడియా, జియో కూడా తమ ప్లాన్ల ధరలను పెంచిన విషయం తెలిసిందే.

Airtel removes cap on free outgoing call

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తేసిన ఎయిర్‌టెల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: