‘పొగ మంచు’తుంది

ఫిబ్రవరి మొదటి వారం వరకు చలితో పాటు పొగమంచూ ఉంటుంది ఏజెన్సీతో పాటు మైదానాల్లో కూడా ఉత్తరాది ధోరణి విస్తరిస్తోంది తెల్లారుజామున, సాయంత్రం ప్రయాణాలు వద్దని అధికారుల హితవు మన తెలంగాణ/హైదరాబాద్ : పొగమంచు ఉత్తర భారతదేశంలో ఎక్కువ గా కనిపిస్తోంది. ప్రస్తుతం మన దగ్గర కూ డా దాని తీవ్రత ఈసారి ఎక్కువగానే కనిపించనున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంటుంది. ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో చలితో పాటు పొగమంచు ప్రభావం ఉంటుంది. డిసెంబర్ నెల నుంచి […] The post ‘పొగ మంచు’తుంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఫిబ్రవరి మొదటి వారం వరకు చలితో పాటు పొగమంచూ ఉంటుంది
ఏజెన్సీతో పాటు
మైదానాల్లో కూడా
ఉత్తరాది ధోరణి విస్తరిస్తోంది
తెల్లారుజామున, సాయంత్రం ప్రయాణాలు వద్దని అధికారుల హితవు

మన తెలంగాణ/హైదరాబాద్ : పొగమంచు ఉత్తర భారతదేశంలో ఎక్కువ గా కనిపిస్తోంది. ప్రస్తుతం మన దగ్గర కూ డా దాని తీవ్రత ఈసారి ఎక్కువగానే కనిపించనున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంటుంది. ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో చలితో పాటు పొగమంచు ప్రభావం ఉంటుంది. డిసెంబర్ నెల నుంచి జనవరి మూడోవారం వరకు దాని తీవ్రత ఎక్కువగానే ఉంటుందని, కానీ ఈసారి ఫిబ్రవరి మొదటివారం వరకు పొగమంచు ప్రభా వం ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. మనరాష్ట్రంలో ఈ సారి ఎక్కువసార్లు పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

వాతావరణ పరిస్థితులు బట్టి పది రోజులు, వారం రోజులు, నాలుగు రోజులు వరుసగా పొగమంచు ఏర్పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈసారి వారంకన్నా ఎక్కువ రోజులు (కంటిన్యూ) పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. ఢిల్లీ, హర్యానా, పంజాబ్ లాంటి ప్రాంతాలతో పాటు ఎపిలోని విశాఖపట్టణం, ఉత్తర కోస్తా, తెలంగాణ రాష్ట్రంలోని (ఉత్తర తెలంగాణ) జిల్లాల్లో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఉత్తర భారతదేశాన్ని ఆనుకొని ఉం డడం వలన ఇక్కడ ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. దీంతోపాటు బంగాళాఖాతం నుంచి (తూర్పు నుంచి ఆగ్నేయ దిశ) నుంచి తేమగాలులు ఎ క్కువగా వస్తుండడం వలన ప్రస్తుతం మనదగ్గర పొగమంచు ఏర్పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

అయితే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణతో పాటు ఏపిలో పొగమంచు ప్రజలను ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే చలి తీవ్రత పెరగడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రోజుల్లో అన్ని జిల్లాల్లో దీని తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేరొంటున్నారు.

పొగమంచుతో రోడ్డు ప్రమాదాలు

ఉదయం సూర్యోదయం కన్నా ముందు, సాయంత్ర సూర్యాస్తమయం తరువాత పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు దట్టంగా అలముకోవడంతో రోడ్డుపై ప్రయాణించే వాహనదారులకు ఇబ్బందిగా మారుతోంది. ఎదురుగా వస్తున్న వాహనాలను గుర్తించలేని పరిస్థితి నెలకొన్నట్టు వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మోటారు వాహనాల చట్టానికి అనుగుణంగా వాహనాల హెడ్‌లైట్లను తయారవుతున్నా డ్రైవర్లు వారి ఇష్టానుసారంగా బల్బులను మార్చడంతో పాటు డిజైన్లను ఏర్పాటు చేసుకోవడం వలన పొగమంచు ఏర్పడినప్పుడు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టు ఆర్‌టిఏ అధికారులు పేర్కొంటున్నారు.

ప్రస్తుతం మైదాన ప్రాంతాల్లోనూ…

ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే ఈ పొగమంచు ప్రభావం ప్రస్తుతం మైదాన ప్రాంతాల్లోనూ కనిపించడం విశేషంగా చెప్పవచ్చు. అయితే పొగమంచు ప్రభావం ప్రతి సంవత్సర ఉంటుందని ఇది కొత్త కాదని, హైదరాబాద్ చుట్టుపక్కల కూడా పొగమంచు ఈసారి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇంకా ఫిబ్రవరి మొదటివారం వరకు ఇదే పరిస్థితి ఉండవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఈ తీవ్రత ఉదయం, సాయంత్రం వేళల్లో ఎక్కువగా ఉంటుందని వాకింగ్ చేసేవారితో పాటు ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పొగమంచు ఏర్పడడానికి కారణాలు…

శీతాకాలంలో పొగమంచు అనేది సర్వసాధారణం. అడవులు ఉన్న ప్రాంతాల్లో దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మాములుగా రాత్రి సమయంలో భూమి చల్లబడిపోతుంది. ఎప్పుడైతే భూమి చల్లబడుతుందో ఆసమయంలో (భూమి మీద ఆనుకొని) ఉన్న గాలిలో తేమ శాతం 90 శాతం కన్నా ఎక్కువగా నమోదవుతుంది. ఆ సమయంలో (గాలిలో ఉన్న తేమ) మొత్తం గడ్డకట్టి నీటి బిందువులుగా మారి అది పొగమంచుగా ఏర్పడుతుంది. ఆ సమయంలో వాహనాలు రోడ్డు మీదకు వచ్చినప్పుడు వాటి అద్దాలపై వాన కురిసినట్టుగా నీటి బిందువులు కనిపిస్తాయి. సూర్యోదయం కాగానే ఆ వేడికి గడ్డకట్టిన తేమ కరిగిపోతుంది. దీనివలన పొగమంచు ప్రభావం తగ్గుతుంది.

ఉత్తర దిశ నుంచి వీస్తున్న శీతల గాలులు దిశ మార్చుకోవడం వలన చలి తీవ్రత, పొగమంచు పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఈసారి ఉష్ణోగ్రతల కంటే ఈసారి 2నుంచి 3 డిగ్రీలు పడిపోయే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. డిసెంబర్ చివర్లో జనవరి మొదటివారంలో ఉదయం పూట వేడి (ఉష్ణోగ్రత) ఉత్తర భారతంలో 12 నుంచి 13 డిగ్రీలు, దక్షిణాన 16 డిగ్రీల వరకు ఉండడం సర్వసాధారణం. అయితే పగలు సూర్యకాంతి ప్రభావం లేకపోతే పొగమంచుతో పాటు చలి తీవ్రత ఎక్కువయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

Heavy Fog In North India

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘పొగ మంచు’తుంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.